జగిత్యాల/జగిత్యాలటౌన్: ఇచ్చిన హామీలు అమలు చేయడం చేతకాక కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ పేరిట కాలయాపన తప్ప రెండున్నరేళ్లలో రేవంత్‌రెడ్డి రాష్ట్ర ప్రజలకు చేసిందేమీ లేదని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ దావ వసంత అన్నారు. కాళేశ్వరం కట్టకముందు యాసంగిలో నీరులేక పొలాలు బీళ్లుగా మారేవని, ప్రాజెక్టుతో రెండు పంటలకు సరిపడా నీరందుతోందని గుర్తుచేశారు. ప్రజల దృష్టి మరల్చేందుకు రేవంత్ రెడ్డి కేసీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిదన్నారు. నాయకులు అయిల్నేని వెంకటేశ్వర్‌రావు, ఆనందరావు, ఆవారి శివకేసరిబాబు, శీలం ప్రియాంక, మహిపాల్‌రెడ్డి, ఒద్ది రాంమోహన్‌రావు, కచ్చు హరీష్, గుండ మధు, ఎల్ల రాజన్న తదితరులు పాల్గొన్నారు.


