500 మార్కులు సాధిస్తే రూ.ఐదువేల ప్రోత్సాహకం | - | Sakshi
Sakshi News home page

500 మార్కులు సాధిస్తే రూ.ఐదువేల ప్రోత్సాహకం

Apr 24 2026 7:26 AM | Updated on Apr 24 2026 7:26 AM

ధర్మపురి: మండలంలోని దోనూర్‌ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని పదో తరగతిలో 500 మార్కులకుపైగా సాధించిన విద్యార్థులకు రూ.ఐదువేల ప్రో త్సాహకం అందించనున్నట్లు సర్పంచ్‌ దాసరి పురుషోత్తం ప్రకటించారు. స్థానిక పాఠశాలలో గురువారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో విద్యార్థులు ప్రోగ్రెస్‌ కార్డులు అందించారు. అలాగే పాఠశాలలో కొత్తగా చేరిన విద్యార్థులకు రూ.516 అందిస్తానని వెల్లడించారు. కార్యక్రమానికి హాజరైన ఎంఈవో సీతామహాలక్ష్మి మాట్లాడుతూ.. సర్పంచ్‌ పురుషోత్తం మిగిలిన గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తారని కొనియాడారు. ప్రతి తరగతి నుంచి గరిష్ట హాజరు సాధించిన విద్యార్థులకు ప్రథమ బహుమతిగా రోజుకు రూ.2, ద్వితీయ బహుమతిగా రూపాయి చొప్పున అందిస్తానని ప్రకటించడం గర్వంగా ఉందన్నారు. అమ్మ ఆదర్శ కమిటీ చైర్‌పర్సన్‌ సుమతి, పంచాయతీ కార్యదర్శి ముత్యం పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement