రాయికల్: పట్టణంలోని శ్రీచెన్నకేశవనాథ ఆలయ విశిష్టతను సోషల్ మీడియా ద్వారా తెలుసుకుని హైదరాబాద్‌కు చెందిన మహిళలు బుధవారం ఆలయాన్ని సందర్శించారు. దేశంలోనే రెండో పంచముఖ లింగం విశిష్ఠతపై ఆలయ అర్చకులు సతీశ్‌శర్మ వారికి వివరించారు. ఈ సందర్భంగా వారు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో అల్వాల్ ఎస్‌ఎఫ్‌ఎస్ సీఎస్ చైర్మన్ తోట వినీత, కాకర ప్రేమలత, మహిళ బృందం సభ్యులు పాల్గొన్నారు.
బడిబాటలో 40 అడ్మిషన్లు
కథలాపూర్: మండలంలోని తక్కళ్లపెల్లిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు బుధవారం బడిబాట నిర్వహించారు. బుధవారం ఒకేరోజు కొత్తగా 40మంది విద్యార్థుల అడ్మిషన్లు వచ్చాయి. పాఠశాలల్లో ఉచిత విద్య, మధ్యాహ్న భోజనం, యూనిఫాంలు అందిస్తామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాజగంగారాం, హెచ్‌ఎం లక్ష్మీనర్సయ్య, కార్యదర్శి పూజిత, వార్డుసభ్యులు పాల్గొన్నారు.
సర్పంచ్ కుమారుడికి అడ్మిషన్
ఇప్పపెల్లి సర్పంచ్ సంబ నవీన్ తన కుమారుడు నియాన్స్‌ను స్థానిక ప్రాథమిక పాఠశాలలో చేర్పించారు. స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం కిషన్‌రావుకు అడ్మిషన్ ఫామ్‌ను అందించారు.
టీబీ రహిత సమాజమే లక్ష్యం
జగిత్యాలరూరల్: టీబీరహిత సమాజమే లక్ష్యమని, వ్యాధి నిర్ధారణతోనే నివారణ సాధ్యమని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని చల్‌గల్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఆధ్వర్యంలో క్షయ నిర్ధారణ, అవగాహన శిబిరంలో పాల్గొన్నారు. రెండు వారాలకు మించి దగ్గు, సాయంత్రం వేళ జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం వంటి లక్షణాలు ఉంటే ఆశా కార్యకర్తలు, ఏఎన్‌ఎంల ద్వారా పరీక్షలు చేయించుకోవాలన్నారు. టీబీ బాధితులకు ఉచితంగా పరీక్షలు, మందులు అందిస్తున్నట్లు పేర్కొన్నారు. వ్యాధిని ప్రాథమిక దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జున్ను రాజేందర్, మెడికల్ ఆఫీసర్ సౌజన్య, ఎంఎల్‌హెచ్‌పీ షామిని, ఉప సర్పంచ్ రుమాన్, పంచాయతీ సెక్రటరీ శ్రీనివాస్, రేడియోగ్రాఫర్ వికాస్, ఎస్టీఎస్ శ్రీనివాస్, సూపర్‌వైజర్ సుజాత, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.
అంజన్న సింహద్వారానికి మరమ్మతు
మల్యాల: మండలంలోని ముత్యంపేటలోగల కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ సింహద్వారానికి అధికారులు మరమ్మతు చేస్తున్నారు. వాటిని బుధవారం ఆలయ ఈవో అంజనారెడ్డి పరిశీలించారు.
పీఆర్సీ అమలు చేయాలి
జగిత్యాల: 51శాతం ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ అమలు చేయాలని ఎస్టీయూ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి మచ్చ శంకర్ అన్నారు. జిల్లాకేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో బుధవారం మాట్లాడారు. ప్రభుత్వం ఏర్పడిన 90రోజుల్లో పీఆర్సీ, పెండింగ్ డీఏ విడుదల చేస్తామని ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. హెల్త్‌కార్డులు, సీపీఎస్ రద్దు అంశాలను పరిష్కరించలేదన్నారు. సమస్యల పరిష్కారం కోసం వచ్చేనెల 5న ప్రభుత్వ ఉపాధ్యాయ, ఉద్యోగులు, పెన్షనర్లు నిరాహార దీక్ష చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు బైరం హరికిరణ్, శివరామకృష్ణ, మేకల ప్రవీణ్, శ్రీనివాస్, నంద్యానాయక్, నరేశ్, తిరుపతి, చారి, మురళీ పాల్గొన్నారు.


