గురుకులాల్లో కార్పొరేట్‌స్థాయి విద్య | - | Sakshi
Sakshi News home page

గురుకులాల్లో కార్పొరేట్‌స్థాయి విద్య

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

● ప్రభుత్వ విద్యపై పెరుగుతున్న నమ్మకం ● మంత్రి లక్ష్మణ్‌ కుమార్‌

వెల్గటూర్‌: విద్యావ్యవస్థలో తీసుకొస్తున్న మార్పులతో తల్లిదండ్రుల్లో ప్రభుత్వ విద్యపై నమ్మకం పెరిగిందని, రోజురోజుకూ ప్రవేశాల సంఖ్య పెరుగుతోందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మండలంలోని స్తంభంపల్లి జ్యోతిబాపూలే గురుకులాన్ని కలెక్టర్‌ సత్యప్రసాద్‌తో కలిసి బుధవారం సందర్శించారు. పేదలకు కార్పొరేట్‌ స్థాయి విద్య అందించాలని లక్ష్యంతో ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులు తెస్తోందని, ప్రతినియోజకవర్గానికి యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ నిర్మాణం, అడ్వాన్స్‌ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తోందన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు ఉదయం అల్పాహారం అందిస్తామన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, వంటగదుల్లో పరిశుభ్రత పాటించాలని సూచించా రు. డీఈవో రాము, సంక్షేమ అధికారులు కె.రాజ్‌కుమార్‌, సునీత, తహసీల్దార్‌ శేఖర్‌, ఎంపీడీవో నరేశ్‌ కుమార్‌, ఎంఈవో ప్రభాకర్‌, ప్రిన్సిపాల్‌ హరిత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement