నూతన నియామకం | - | Sakshi
Sakshi News home page

నూతన నియామకం

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

రాయికల్‌: అంతర్జాతీయ మానవ హక్కుల పరిరక్షణ మండలి జిల్లా అధ్యక్షుడిగా రాయికల్‌కు చెందిన ఆడెపు రాజమౌళి నియమితులయ్యారు. ఈ మేరకు నేషనల్‌ చైర్మన్‌ శిరీన్‌, జాతీయ అధ్యక్షుడు ఎస్‌కె.మజీద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఆయన జర్నలిస్టుగా, విద్యాసంస్థల వ్యవస్థాపకుడిగా, రాయికల్‌ మున్సిపల్‌ ఉద్యోగిగా అందించిన సేవలకుగాను జాతీయ నాయకత్వం ఈ నియామకం చేపట్టింది. రాజమౌళి మాట్లాడుతూ జిల్లాలో మానవ హక్కులను రక్షించేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ఆయన ఎంపిక పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.

ఒబులాపూర్‌లో డీఎల్పీవో విచారణ

మల్లాపూర్‌: మండలంలోని మొగిలిపేటకు చెందిన మంగళారపు గంగారాంకు సంబంధించిన ఎకరం భూమిని ఇతరులకు విరాసత్‌ చేయడంతో బాధితుడు మంగళవారం ఆమరణ దీక్ష చేపట్టాడు. ఉన్నతాధికారులు స్పందించి సమగ్ర విచారణకు ఆదేశించారు. బుధవారం ఒబులాపూర్‌కు వెళ్లిన డీఎల్పీవో సుదర్శన్‌, ఎంపీడీవో జగదీశ్‌ గ్రామపంచాయతీలో విరాసత్‌ పట్టాకు కారణమైన ధ్రువీకరణ పత్రం జారీపై విచారణ చేపట్టారు. మంగళారపు (గాండ్ల) రాజేశ్వరి తాత గంగరాం పేరిట బ్యాంక్‌ పనికోసమని 30ఏళ్ల క్రితం చనిపోయినట్లు ధ్రువీకరణ పత్రం రాసివ్వాలని పంచాయతీ కార్యదర్శి శ్రీని వాస్‌కు దరఖాస్తు పెట్టుకోగా ఆయన జారీ చేశాడు. ఆ పత్రంతోనే రాజేశ్వరి విరాసత్‌ పట్టా చేయించుకున్నట్లు విచారణలో తేలిందని, విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించనున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement