సమావేశంలో మున్సిపల్ కమిషనర్
ఖాళీగా కుర్చీలు
రాయికల్: రాయికల్ మున్సిపాలిటీలో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక వాయిదా పడింది. సభ్యుల ఎన్నిక బుధవారం ఉంటుందని మున్సిపల్ కమిషనర్ కీర్తి నాగరాజు గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో సాధారణ సమావేశం అనంతరం సభ్యుల ఎన్నిక ప్రక్రియ ఉంటుందని వెల్లడించారు. అయితే చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు ఎవరూ సకాలంలో హాజరు కాకపోవడంతో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నికను వాయిదా వేసినట్లు కమిషనర్ తెలిపారు. ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. 11.35 గంటల వరకు కమిషనర్, అధికారులు చైర్మన్, వైస్‌చైర్మన్, కౌన్సిలర్ల రాక కోసం ఎదురుచూశారు. సమయం మించిపోయినప్పటికీ చైర్మన్ కట్కం రవి, వైస్ చైర్మన్ తురగ సౌజన్య, మిగతా సభ్యులెవరూ హాజరుకాకపోవడంతో సమావేశాన్ని వాయిదా వేశారు. త్వరలోనే మరో తేదీని ప్రకటిస్తామని తెలిపారు.


