హైకోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్‌ హర్షం | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు తీర్పుపై బీఆర్‌ఎస్‌ హర్షం

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

జగిత్యాలటౌన్‌: కాళేశ్వరం ప్రాజెక్టు విచారణ కమిషన్‌పై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు బుధవారం జిల్లాకేంద్రంలో సంబరాలు జరుపుకున్నారు. తహసీల్‌ చౌరస్తాలో స్వీట్లు పంచిపెట్టారు. జెడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ.. కాళేశ్వరంపై రాష్ట్రప్రభుత్వం నియమించిన పీసీ.ఘోష్‌ కమిషన్‌ నివేదికను నిలుపుదల చేస్తూ.. హైకోర్టు తీర్పు ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు. కక్ష సాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వానికి కోర్టు తీర్పు చెంపపెట్టు లాంటిదన్నారు. తెలంగాణకు కల్పతరువు వంటి కాళేశ్వరం ప్రాజెక్టును రెండున్నరేళ్లుగా నిరుపయోగంగా ఉంచిన రేవంత్‌రెడ్డి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాజ్యాంగం, చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహరించినాన్యాయస్థానాలు చూస్తూ ఊరుకోబోవని తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టిన కుంగిన రెండు పిల్లర్లకు మరమ్మతు చేసి రైతులకు సాగు, తాగునీటిని అందించాలని కోరారు. కార్యక్రమంలో పట్టణ, మండల బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement