అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి | - | Sakshi
Sakshi News home page

అభివృద్ధి పనులు త్వరగా పూర్తి చేయాలి

Apr 23 2026 7:36 AM | Updated on Apr 23 2026 7:36 AM

● కలెక్టర్‌సత్యప్రసాద్‌

జగిత్యాల: పంచాయతీరాజ్‌, ఉపాధిహామీ కింద చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. అధికారులతో బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. పంచాయతీరాజ్‌, అంగన్‌వాడీ భవనాలు, కిచెన్‌షెడ్స్‌, టాయిలెట్స్‌ వెంటనే చేపట్టాలన్నారు. నాణ్యతలో రాజీపడొద్దని, పిల్లలకు అన్ని వసతులూ ఉండాలని సూచించారు. ఉపాధిహామీ పథకం ద్వారా కార్మికులకు వసతులు కల్పించాలన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు ఉపయోగపడేలా ప్రతి పని ప్రణాళికబద్ధంగా అమలు కావాలన్నారు.

అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి

సాంఘిక సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాలలో ప్రభుత్వం కల్పించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ అన్నారు. గురుకులాల పోస్టర్‌ ఆవిష్కరించారు. 2026–27కు గాను డిగ్రీలో అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని, నిష్ణాతులైన అధ్యాపకులు ఉన్నారని, ఇంటర్నెట్‌ సౌకర్యం, ల్యాబ్‌లు ఉన్నాయన్నారు. ప్రిన్సిపల్‌ శ్రీలత పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement