వడదెబ్బ మృతుల కుటుంబాలకు భరోసా | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బ మృతుల కుటుంబాలకు భరోసా

Apr 22 2026 7:30 AM | Updated on Apr 22 2026 7:30 AM

● మరణానికి వడదెబ్బ కారణమని తెలిపే పోస్టుమార్టం రిపోర్టు ● పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్‌ జిరాక్స్‌ ● మున్సిపాలిటీ లేదా గ్రామ పంచాయతీ జారీ చేసిన మరణ ధ్రువీకరణ పత్రం ● మరణించిన రోజున ఎండ తీవ్రత అధికంగా ఉన్నట్లు వాతావరణ శాఖ నుంచి నుంచి ధ్రువీకరణ పత్రం

మల్లాపూర్‌: రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి చేరుతున్నాయి. పెరుగుతున్న ఎండలతో వడదెబ్బ మరణాలు సంభవిస్తున్నాయి. వడదెబ్బతో మృతిచెందిన వారి కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి రూ.4లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది.

పరిహారం పొందేందుకు కావాల్సిన పత్రాలు..

దరఖాస్తు విధానం

అర్హులు సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయంలో దరఖాస్తు సమర్పించాలి. ఆ దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం కలెక్టర్‌ తుది ఆమోదం తెలుపుతారు. కలెక్టర్‌ ఆమోదం పొందిన వెంటనే పరిహారం మొత్తం నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమవుతుంది. వడదెబ్బ మరణాల విషయంలో జాప్యం లేకుండా త్వరితగతిన సహాయం అందేలా చూడాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement