ఈత సరదా విషాదం కావొద్దు | - | Sakshi
Sakshi News home page

ఈత సరదా విషాదం కావొద్దు

Apr 22 2026 7:30 AM | Updated on Apr 22 2026 7:30 AM

జగిత్యాలక్రైం: వేసవిలో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు రావడంతో పిల్లలు, యువకులు ఈత నేర్చుకోవడానికి చెరువులు ,కాలువల వద్దకు వెళ్తారని, నీటిలో మునిగి ప్రాణనష్టం వాటిల్లే అవకాశం ఉందని ఎస్పీ అశోక్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈత రానివారు బావులు, చెరువుల వద్దకు ఒంటరిగా వెళ్లొద్దన్నారు. తల్లిదండ్రుల సమక్షంలో ఈత నేర్చుకోవాలన్నారు. పిల్లలు చెరువులు, కుంటల వద్దకు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా మైనర్‌ డ్రైవింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని, తల్లిదండ్రులు మైనర్లకు వాహనం ఇవ్వొద్దని చెప్పారు. మైనర్లకు వాహనం ఇస్తే ప్రమాదం జరిగినా.. వాహనంతో పట్టుబడినా వాహన యజమానిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు

చిన్న నిర్లక్ష్యంతో ప్రాణనష్టం

ఎస్పీ అశోక్‌ కుమార్‌

Advertisement
 
Advertisement
Advertisement