ఓటరు జాబితా పారదర్శకంగా నిర్వహించాలి | - | Sakshi
Sakshi News home page

ఓటరు జాబితా పారదర్శకంగా నిర్వహించాలి

Apr 22 2026 7:30 AM | Updated on Apr 22 2026 7:30 AM

జగిత్యాల: ఓటరు జాబితాను పారదర్శకంగా చేపట్టాలని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అన్నారు. ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఆర్డీవో కార్యాలయాన్ని పరిశీలించారు. కొత్తవారిని ఓటరు జాబితాలో చేర్చడంపై దృష్టి పెట్టాలన్నారు. బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి వివరాలు సేకరించాలన్నారు. ఆర్డీవో మధుసూదన్‌, తహసీల్దార్లు పాల్గొన్నారు. అనంతరం పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే పోస్టర్‌ ఆవిష్కరించారు. డీఈవో రాము, సైన్స్‌ అధికారి రాజశేఖర్‌, సెక్టోరియల్‌ అధికారి సత్యనారాయణ పాల్గొన్నారు.

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

Advertisement
 
Advertisement
Advertisement