చివరిగింజ వరకు కొంటాం | - | Sakshi
Sakshi News home page

చివరిగింజ వరకు కొంటాం

Apr 22 2026 7:30 AM | Updated on Apr 22 2026 7:30 AM

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

కథలాపూర్‌: కొనుగోలు కేంద్రాల్లో చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తామని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు. మండలంలోని గంభీర్‌పూర్‌లో సెర్ప్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని మంగళవారం ప్రారంభించారు. రైతులు కేంద్రాల్లోనే ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. ఏ గ్రేడ్‌కు రూ.2,389 ఉందన్నారు. సన్నరకానికి బోనస్‌ రూ.500 ఇస్తున్న ఘనత కాంగ్రెస్‌ ప్రభుత్వానిదేనన్నారు. ఏఎంసీ చైర్మన్‌ నారాయణరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, ఏపీఎం చిన్నరాజయ్య, కారపు గంగాధర్‌, హరిప్రసాద్‌, ప్రకాశ్‌నాయక్‌, శేఖర్‌ పాల్గొన్నారు.

ధాన్యం సేకరణ పారదర్శకంగా చేపట్టాలి

అడిషనల్‌ కలెక్టర్‌ లత

జగిత్యాల: ధాన్యం సేకరణ పారదర్శకంగా చేపట్టాలని అడిషనల్‌ కలెక్టర్‌ లత అన్నారు. కలెక్టరెట్‌లో బాయిల్డ్‌ రైస్‌మిల్లర్లతో మంగళవా రం సమావేశం నిర్వహించారు. యాసంగి సీజన్‌కు సంబంధించి దిగుమతిలో జాప్యం లేకుండా చూడాలని, లారీల అన్‌లోడింగ్‌ వేగవంతం చేయాలన్నారు. మిల్లుల వద్ద ధాన్యం పేరుకుపోకుండా హమాలీలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌ సకాలంలో పూర్తి చేయాలన్నారు. అధికారులు పర్యవేక్షించాలని సూచించారు. జిల్లా పౌరసరఫరాల అధికారి జితేందర్‌రెడ్డి, మేనేజర్‌ జితేంద్రప్రసాద్‌, తహసీల్దార్లు పాల్గొన్నారు.

శంకరాచార్యుల జయంతి

ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి అనుబంధం శ్రీరామలింగేశ్వరస్వామి ఆలయంలోని జగద్గురు ఆది శంకరాచార్యుల జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ద్యావల్ల సాయి మంత్రోచ్ఛరణలతో శంకరాశారదాంబ అమ్మవారికి మహన్యాసక పూర్వక రుద్రాభిషేకం, అష్ఠోత్తర పూజ, మన్యసూక్తం, పంచోపనిషత్‌లతో అభిషేకం చేశారు. కార్యక్రమంలో ఆల య అర్చకులు, భక్తులు తదితరులున్నారు.

అంజన్న ఉద్యోగుల అంతర్గత బదిలీలు

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామి ఆలయ ఉద్యోగులకు అంతర్గత బదిలీలు జరి గాయి. సీనియర్‌ అసిస్టెంట్‌ ఉపాద్యాయుల చంద్రశేఖర్‌కు సూపరింటెండెంట్‌గా పదోన్న తి, ఆలయ పర్యవేక్షకులుగా.. సునీల్‌కుమార్‌ ను పీఆర్‌వోగా.. పవన్‌కుమార్‌ను పరిపాలన, అకౌంట్స్‌, తూము శ్రీనివాస్‌ను ఆలయ ఇన్స్‌పెక్టర్‌గా బదిలీ చేశారు. చంద్రశేఖర్‌ను ఆలయ అర్చకులు శాలువాతో సన్మానించారు.

భక్తుల సందడి..

కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో మంగళవారం భక్తుల సందడి నెలకొంది. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు క్యూలైన్ల ద్వారా స్వామివారిని దర్శించుకొని, మొక్కులు చెల్లించుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement