మెట్‌పల్లి: మెట్‌పల్లి మున్సిపాలిటీలో కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక ప్రక్రియ గందరగోళంగా మారింది. ఈ ఎన్నికకు సంబంధించిన పలు విషయాల్లో అధి కారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో కౌన్సిలర్లతోపాటు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ముందుగా ఈనెల 23న ఎన్నిక చేపట్టాలని నిర్ణయించారు. పోటీలో ఉన్న అభ్యర్థుల పేర్లను ఎజెండాలో పొందుపరుస్తూ ఆ ప్రతులను కౌన్సిలర్లకు ఆదివారం పంపిణీ చేశా రు. మొత్తం నాలుగు పదవులకు 24మంది దరఖాస్తు చేసుకోగా.. ఇందులో ఎవరినీ అనర్హులు గా గుర్తించకుండానే ఎజెండాలో అందరి పేర్లు చే ర్చారు. కౌన్సిలర్లకు ఇచ్చిన ఎజెండా ప్రతులను మరుసటిరోజు వెనక్కి తీసుకున్న అధికారులు.. మార్పులు చేసి మళ్లీ మంగళవారం తిరిగి కౌన్సిలర్లకు అందించారు. అయితే అందులో ఎన్నిక తేదీని 24కు మార్చడంతోపాటు కొందరు అభ్యర్థులు అనర్హులని పేర్కొనడం వివాదానికి దారి తీసింది. నిబంధనల ప్రకారం వచ్చిన దరఖాస్తులను అధికా రులు పరిశీలించి అందులో అనర్హులుంటే వారిని పోటీ నుంచి తప్పించాలి. కానీ అలా చేయకుండానే తొలుత అందరి పేర్లతో కూడిన ఎజెండా ప్రతులను పంపిణీ చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
అనర్హుల్లో కాంగ్రెస్ పట్టణాధ్యక్షుడి సతీమణి
న్యాయ పోరాటానికి
సిద్ధమవుతున్న పలువురు
అనర్హులను గుర్తించకుండానే కౌన్సిలర్లకు ఎజెండా ప్రతులు
తర్వాత వెనక్కి తీసుకుని మరో ఎజెండా అందజేత
అందులో నలుగురిని అనర్హులుగా ప్రకటించిన వైనం
వివాదాస్పదమైన మెట్‌పల్లి మున్సిపల్ అధికారుల తీరు


