జగిత్యాల: బీఆర్‌ఎస్ పార్టీలో అప్పుడే ముసలం పుట్టిందని, జీవన్‌రెడ్డి చేరికను మాజీమంత్రి హరీశ్‌రావు వ్యతిరేకిస్తున్నారని, అందుకే జగిత్యాల సభకు రాకుండా రహస్యంగా ఢిల్లీ వెళ్లారని ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ అన్నారు. పార్టీ కార్యాలయంలో సోమవారం విలేకరులతో మాట్లాడారు. పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన సభకు హరీశ్‌రావు గైర్హాజరు వెనుక మతలబేంటో బీఆర్‌ఎస్ నాయకులు చెప్పాలన్నారు. ఇటీవల కేటీఆర్ బుజ్జగించి హరీశ్‌రావును జీవన్‌రెడ్డి ఇంటికి తీసుకొచ్చారని, జీవన్‌రెడ్డిని బీఆర్‌ఎస్ శ్రేణులు ఐరెన్‌లెగ్‌గా పరిగణిస్తున్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ శ్రేణులంతా నారజ్‌లో ఉన్నారని, అందుకే జీవన్‌రెడ్డి ఫొటోలు తొలగించారని పేర్కొన్నారు. గతంలో రేవంత్ కావాలి.. కేసీఆర్ పోవాలన్న జీవన్‌రెడ్డి.. ఇప్పుడు రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలనడం ప్యాకేజీ మాటలన్నారు. సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు గాజంగి నందయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ సమిండ్ల వాణి, టీపీసీసీ సెక్రెటరీ బండ శంకర్, కొత్త మోహన్, మన్సూర్, గడ్డం నారాయణరెడ్డి పాల్గొన్నారు.


