ధర్మపురి: బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో మిగిలిపోయిన ప్రాజెక్టుల పనులను పూర్తిచేసి రైతులకు సాగునీరందిస్తామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. పట్టణ శివారులో ఉన్న అక్కపల్లి చెరువును అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి సందర్శించారు. అక్కపల్లి చెరువు, రోళ్లవాగు ఎత్తిపోతల, ఇతర ప్రాజెక్టుల పనులు పూర్తి చేసి చివరి ఆయకట్టు వరకు నీరందిస్తామని తెలిపారు. సాగునీటి విషయంలో రైతులకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపడుతామని అన్నారు. రోళ్లవాగు విషయంలో ధర్మపురి ఎమ్మెల్యే, మాజీమంత్రి కొప్పుల ఈశ్వర్ రూ.60కోట్లతో 2016లో పనులు ప్రారంభించి రూ.140 కోట్లకు పెంచారని, అయినప్పటికీ ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలన్నారు. మున్సిపల్ చైర్‌పర్సన్ వేముల నాగలక్ష్మి, ఏఎంసీ చైర్‌పర్సన్ చిలుముల లావణ్య, కౌన్సిలర్లు చిపిరిశెట్టి రాజేశ్ సంబందిత శాఖ అధికారులు తదితరులున్నారు.


