రాయికల్:రాయికల్ మున్సిపల్ కార్యాలయంలో ఈనెల 22న ఉదయం 11 గంటలకు ప్రత్యేక సమావేశంతోపాటు కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక నిర్వహిస్తున్నట్లు కమిషనర్ కీర్తి నాగరాజు సోమవారం తెలిపారు. మొత్తం నాలుగు కోఆప్షన్ స్థానాలు భర్తీ చేయనున్నారు. కౌన్సిలర్లు సకాలంలో హాజరుకావాలని కమిషనర్ పేర్కొన్నారు.
హిందువుల్లో ఐక్యత పెరగాలి
రాయికల్ హిందువుల్లో ఐక్యత పెరిగితేనే ధర్మం నిలబడుతుందని ప్రముఖ సామాజిక సమరవేత్త కల్యాణి అన్నారు. సోమవారం రాత్రి రాయికల్ మండలం అయోధ్య గ్రామంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హిందువులు తమ పిల్లలను తప్పనిసరిగా హిందూ ఆచార, సంప్రదాయాలను అలవాటు చేయాలని గుర్తుచేశారు. ప్రపంచ దేశాలన్నీ మన దేశాన్ని ఆదర్శంగా తీసుకుంటున్నాయని తెలిపారు. గోవులను ప్రతిఒక్కరూ పూజించాలని, సకల దేవతలు గోవులో ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం గోపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్తలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.


