హెల్మెట్‌ ధరించి.. సైకిల్‌ సవారీ | - | Sakshi
Sakshi News home page

హెల్మెట్‌ ధరించి.. సైకిల్‌ సవారీ

Apr 20 2026 8:29 AM | Updated on Apr 20 2026 8:29 AM

వేములవాడరూరల్‌: వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్‌ ధరించాలని ప్రజలకు పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. అయినా కొంత మంది వాహనదారుల్లో మార్పు రావడం లేదు. కానీ, 70 ఏళ్ల వృద్ధ రైతు హెల్మెట్‌ ధరించి సైకిల్‌పై రోజూ మార్కెట్‌కు వెళ్తూ ఆదర్శంగా నిలుస్తున్నాడు. వేములవాడ మున్సిపల్‌ పరిధి కోనాయపల్లికి చెందిన సాయిని నారాయణ 50 ఏళ్ల నుంచి సైకిల్‌ వాడుతున్నాడు. సైకిల్‌పై ఇంటి నుంచి బయటకు వచ్చాడంటే హెల్మెట్‌ ధరిస్తాడు. ఆయన సైకిల్‌కు చార్జింగ్‌ బ్యాటరీ ఏర్పాటు చేసుకున్నాడు. తాను పండించిన పంటలను కోనాయపల్లి నుంచి వేములవాడ మార్కెట్‌కు తీసుకువచ్చి విక్రయిస్తాడు. 70 ఏళ్ల వయస్సులో కూడా నారాయణ హెల్మెట్‌ ధరించి సైకిల్‌పై రావడంతో పలువురు అభినందిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement