వేసవిలో గర్భిణులు జాగ్రత్త తీసుకోవాలి. శరీరం డిహైడ్రేషన్ కాకుండా చూసుకోవాలి. ఇంట్లోనూ మంచి నీటిలో ఉప్పుచక్కెర వేసుకుని తాగాలి. గర్భిణులు, చిన్నారులు, వృద్ధులు బయటకు వెళ్లకపోవడం ఉత్తమం. మాంసాహారం, మసాలా దినుసులు, నూనె పదార్థాలు అధికంగా వాడొద్దు. వదులైనా కాటన్ దుస్తులను ధరించాలి. లవణాలతో కూడిన నీటిని అధికంగా తీసుకోవాలి. ఓఆర్‌ఎస్ పొట్లాలు ఎల్లప్పుడు అందుబాటులో ఉంచుకోవాలి. పండ్ల రసాలు, కొబ్బరినీళ్లు తాగాలి. చలువైన వస్తువులు వాడాలి. నీటిని తాగుతూ ఉండాలి. ఏ సమయంలోనూ అజాగ్రత్త వహించకుండా బయటి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు తాగునీటిని వెంట తీసుకెళ్లాలి. వంట గదులు చల్లగా ఉండేలా చర్యలు తీసుకోవాలి. ప్రతి 30 నిమిషాలకు నీటిని తాగుతూ ఉండాలి.
– సాయిని నరేందర్, ఎండీ పల్మనాలజిస్ట్
వేసవిలో వాహనాల్లో గాలిని తరచూ చెక్ చేసుకోవాలి. నేరుగా ఎండ పడే చోట వాహనాన్ని నిలుపరాదు. నీడ ఉంటే చోటే నిలుపాలి. ఇంజిన్ అత్యధికంగా వేడెక్కితే డ్యాష్‌బోర్డులోని చెక్ ఇంజిన్, ఓవర్ హీట్ గుర్తులు బ్లింక్ అవుతుంటాయి. అప్రమత్తమై కూలంట్, రెడియేటర్ క్యాప్ సరిగా ఉన్నాయో లేవో చూసుకోవాలి. ఇంజిన్ ఆయిల్, బ్రేక్ ఆయిల్, గేర్ బాక్స్ ఆయిల్, ఏసీ కంప్రెసర్, వాటర్ లెవల్స్ తరచూ చెక్ చేస్తుండాలి. ఎండ అత్యధికంగా ఉండే మధ్యాహ్నం సమయంలో ప్రయాణం వాయిదా వేసుకోవడం ఉత్తమం. వీలైతే అసలు ప్రయాణం చేయకుండా ఉంటేనే మేలు. లాంగ్ టూర్ వెళ్లేవారు 50కిలోమీటర్లకు ఒకసారి బ్రేక్ తీసుకోవాలి. కారు, బైక్ వేటిలో ప్రయాణించినా అత్యవసరంలో ఉపయోగపడేలా రకరకాల సైజుల స్క్రూడ్రైవర్లు, రెంచ్‌లు, జాకీ, టైరు ఐరన్, చేతికి గ్లౌజులు, చీకట్లో ఉపయోగపడే ఫ్లాష్‌లైట్ వెంట ఉంచుకోవాలి.
– రమణ, మెకానిక్


