జగిత్యాల: జిల్లా కేంద్రంలోని హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఎదురుగా ఉన్న ఓ ఇడ్లీ సెంటర్‌లో చట్నీలో గడ్డిపురుగు వచ్చింది. అజయ్ అనే వ్యక్తి పూరి తినేందుకు ఆ హోటల్‌కు వెళ్లాడు. పూరితోపాటు చట్నీ వేసుకున్న అతడికి గడ్డిపురుగు రావడంతో భయాందోళనకు గురయ్యాడు. వెంటనే యాజమాన్యానికి చూపించినా.. నిర్లక్ష్య సమాధానం ఇచ్చారని బాధితుడు పేర్కొన్నారు. ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌కు ఫిర్యాదు చేయగా.. ఆయన స్పందించలేదని ఆరోపించాడు.
గంజాయి విక్రేతల అరెస్ట్
మెట్‌పల్లి: మెట్‌పల్లిలో గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు యువకులను అరెస్ట్ చేసినట్లు ఎస్సై కిరణ్‌కుమార్ తెలిపారు. మెట్‌పల్లికి చెందిన మల్యాల చందు, కోరుట్ల మండలం మోహన్‌రావుపేటకు చెందిన బాణాల రాజుల కొంతకాలంగా మెదక్ జిల్లా నుంచి గంజాయిని ఇక్కడకు తీసుకొచ్చి అర్బన్ హౌజింగ్ కాలనీలోని ఓ ఇంట్లో చిన్న ప్యాకెట్లలో పెట్టి విక్రయిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆదివారం సాయంత్రం ఇంటిపై దాడి చేసి ఇద్దరిని పట్టుకున్నారు. వారి నుంచి 140గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
పీఎంఐకి దరఖాస్తులు ఆహ్వానం
రామగుండం: ప్రస్తుత విద్యాసంవత్సరంలో టెన్త్, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థుల నుంచి ప్రధానమంత్రి ఇంటర్న్‌షిప్ పథకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. పది, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా కోర్సులు పూర్తిచేసినవారు అర్హులు. శిక్షణ(ఇంటర్న్‌షిప్) సమయంలో ప్రతీ అభ్యర్థికి నెలకు రూ.9,000 అందిస్తారు. శిక్షణకాలం కంపెనీలను బట్టి 6, 9, 12 నెలలు ఉంటుంది. ఆసక్తిగలవారు ((httpr://pmintern ship.mca.gov.in)) లేదా ((myrcheme.gov.in/ rchemer/pmir) పోర్టల్‌లో వివరాలను నమోదు చేసుకోవాలి.


