సూరమ్మ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి | - | Sakshi
Sakshi News home page

సూరమ్మ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయండి

Apr 20 2026 8:11 AM | Updated on Apr 20 2026 8:11 AM

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

● ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌

కథలాపూర్‌: మండలంలోని కలిగోట శివారులో నిర్మిస్తున్న సూరమ్మ ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. ప్రాజెక్టు పనులను ఆదివారం పరిశీలించి అక్కడే నీటిపారుదలశాఖ అధికారులతో సమీక్షించారు. త్వరలోనే ప్రాజెక్టు కుడికాలువ పనులు ప్రారంభించాలని అధికారులకు సూచించారు. వర్షాకాలం వరకు ప్రాజెక్టులో నీరు నిల్వ ఉండేలా చూడాలన్నారు. నీటిపారుదలశాఖ ఈఈ ప్రకాశ్‌రావు, ఏఎంసీ చైర్మన్‌ నారాయణరెడ్డి, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, నాయకులు కల్లెడ గంగాధర్‌, రవి, హరిప్రసాద్‌, రాజారెడ్డి, అంజయ్య, రాజు తదితరులు పాల్గొన్నారు.

అంజన్న సన్నిధిలో సమాచార కమిషనర్‌ పూజలు

మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయస్వామివారిని ప్రధాన సమాచార కమిషనర్‌ జి.చంద్రశేఖర్‌ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. స్థానాచార్యులు శేషవస్త్రం కప్పి, స్వామివారి తీర్థప్రసాదాలు అందించారు. ఆలయ పర్యవేక్షకులు అశోక్‌, ఎస్సై నరేశ్‌కుమార్‌ పాల్గొన్నారు.

నృసింహుడి సన్నిధిలో..

ధర్మపురి: అనంతరం చంద్రశేఖర్‌రెడ్డి ధర్మపురిలోని శ్రీలక్ష్మీనృసింహస్వామిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆలయం తరఫున స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు.

23న కో–ఆప్షన్ల ఎన్నిక

మెట్‌పల్లి: మెట్‌పల్లి మున్సిపాలిటీలో కో–ఆప్షన్‌ సభ్యుల ఎన్నికకు రంగం సిద్ధమైంది. మొత్తం నలుగురు సభ్యుల ఎన్నికకు ఈ నెల 23న పాలకవర్గ ప్రత్యేక సమావేశం నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పదవుల కోసం 24మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇందులో రెండు మైనార్టీల పదవులకు 18మంది, మిగతా రెండు పదవులకు 8మంది దరఖాస్తు అందించారు. వీటిలో ఏవీ తిరస్కరణకు గురికాలేదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ దఫా కో–ఆప్షన్‌ పదవులకు తీవ్రమైన పోటీ నెలకొంది. ఇప్పటికే కొందరు కౌన్సిలర్లను ఆకట్టుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. విందులు ఏర్పాటు చేయడంతో పాటు డబ్బులు ఆశ చూపుతున్నారు. ఈ నేపథ్యంలో పదవులు ఎవరిని వరిస్తాయన్నది ఉత్కంఠగా మారింది.

Advertisement
 
Advertisement
Advertisement