కేసీఆర్‌ సభకు రండి | - | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ సభకు రండి

Apr 20 2026 8:11 AM | Updated on Apr 20 2026 8:11 AM

జగిత్యాలరూరల్‌: మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో తన అనుబంధం ఈనాటిదికాదని, ఆయన సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరుతున్న సందర్భంగా నిర్వహించే సభకు అధిక సంఖ్యలో హాజరుకావాలని మాజీమంత్రి జీవన్‌ రెడ్డి అన్నారు. జగిత్యాల రూరల్‌ మండలం చల్‌గల్‌లో ఆదివారం కార్యకర్తలతో సమావేశమయ్యారు. తెలంగాణ ఉద్యమ సారథిగా పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్‌ అని, గతంలో ఓ రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఆయనపైనా పోటీ చేశానని, కాంగ్రెస్‌లో నాయకత్వలోపంతో పార్టీని వీడే పరిస్థితి ఏర్పడిందని పేర్కొన్నారు. రైతుబిడ్డగా, రైతు సంక్షేమం కోసం కేసీఆర్‌ రైతుబంధు, రైతుబీమా తీసుకొస్తే ఇప్పుడున్న ప్రభుత్వం నీరుగారుస్తోందన్నారు. గోదావరి జలాలను సద్వినియోగం చేసుకోవాలని, మేడిగడ్డ వద్ద 300 టీఎంసీల నీటి లభ్యత ఇప్పటికీ ఉందని, బ్యారేజీని పునరుద్ధరించి రైతులకు సాగునీరు అందించాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు దావ సురేష్‌, జున్ను రాజేందర్‌, పెద్దన్న, ఎల్ల రాజన్న, ధర రమేష్‌బాబు, నరేష్‌ గౌడ్‌, శ్రీరాముల గంగాధర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement