జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాలో ఆదివారం 44.4 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఎండపల్లి మండలం గుల్లకోటలో 44.4 డిగ్రీలు, భీమారం మండలం గోవిందారంలో 41.4, కోరుట్ల, సారంగాపూర్, మల్లాపూర్, కొడిమ్యాల మండలం పూడూరులో 44.2, ఇబ్రహీంపట్నం మండలం గోదూర్‌లో 44.1, కోరుట్ల మండలం అయిలాపూర్‌లో 44, రాయికల్ మండలం అల్లీపూర్‌లో 43.9, ధర్మపురి మండలం జైనా, మేడిపల్లిలో 43.7, పెగడపల్లిలో 43.6, మల్లాపూర్ మండలం రాఘవపేటలో 43.5, నేరేళ్లలో 43.3, వెల్గటూర్, బీర్‌పూర్, కోల్వాయి, మెట్‌పల్లిలో 43 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


