వామ్మో ఎండ.. | - | Sakshi
Sakshi News home page

వామ్మో ఎండ..

Apr 19 2026 7:47 AM | Updated on Apr 19 2026 7:47 AM

జగిత్యాలఅగ్రికల్చర్‌: జిల్లాలో ఉష్ణోగ్రతలు శనివారం 44.2 డిగ్రీలకు చేరాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇంట్లోంచి బయటకు వెళ్లాలంటేనే జంకాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇబ్రహీంపట్నం మండలం గోధూర్‌లో అత్యధికంగా 44.2 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యల్పంగా భీమారం మండలం గోవిందారంలో 41 డిగ్రీ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాయికల్‌ మండలం అల్లీపూర్‌లో 44.1, బీర్‌పూర్‌ మండలం కొల్వాయి, మేడిపల్లి మండలంలో 44, సారంగాపూర్‌, కోరుట్ల మండలం అయిలాపూర్‌, మల్లాపూర్‌ మండలం రాఘవపేటలో 43.8, మెట్‌పల్లిలో 43.7, కోరుట్లలో 43.6, రాయికల్‌లో 43.5, మల్లాపూర్‌, ఎండపల్లి మండలం గుల్లకోటలో 43.4, బుగ్గారం మండలం సిరికొండలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Advertisement
 
Advertisement
Advertisement