● డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్
జగిత్యాలరూరల్: క్షయ వ్యాధి నివారణకు ప్రతిఒక్కరూ కృషి చేయాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో శ్రీనివాస్ అన్నారు. జగిత్యాల రూరల్ మండలం కల్లెడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని పొలాసలో క్షయ వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. రెండు వారాలకు మించి దగ్గు రావడం, సాయంత్రం జ్వరం, అకారణంగా బరువు తగ్గడం, ఆకలి మందగించడం వంటి లక్షణాలు కనిపిస్తే తెమడ పరీక్షలు చేయించుకోవాలని కోరారు. 46 మందికి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. కల్లెడ పీహెచ్‌సీ వైద్యాధికారి సౌజన్య, ఎంఎల్‌హెచ్‌పీ సౌమ్య, సూపర్‌వైజర్ మంకిడి శ్రీనివాస్, ఎస్టీఎస్ శ్రీనివాస్, ఏఎన్‌ఎం స్వరూప, ఆశా కార్యకర్తలు మల్లీశ్వరి, భాగ్యలక్ష్మి పాల్గొన్నారు.
కూరగాయలు ఎగుమతి చేసే స్థాయికి చేరాలి
జగిత్యాలఅగ్రికల్చర్: రైతులు కూరగాయలు పండించడంతోపాటు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి కట్ట లత అన్నారు. జిల్లాకేంద్రంలోని ఉద్యాన, వ్యవసాయ, సహకార శాఖ ల ఆధ్వర్యంలో శనివారం వెజిటేబుల్ వలంటీర్లకు కూరగాయల సాగుపై శిక్షణ కల్పించారు. కూరగాయలు, పండ్లు, పూలతోటలు సాగుచేసే రైతులకు సబ్సిడీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నా రు. కూరగాయ నారును ములుగు ఉద్యాన నర్సరీ నుంచి ఉచితంగా సరఫరా చేయనున్న ట్లు తెలిపారు. డీఏవో భాస్కర్ మాట్లాడుతూ.. రాబోయే వానకాలంలో దొడ్డురకాలకు బదులు సన్నరకాలు సాగు చేయాలన్నారు. యూరి యా వాడకం తగ్గించి, నానో వాడాలని కోరా రు. సహకార శాఖ సూపరింటెండెంట్ అసద్, ఉద్యాన శాఖ అధికారులు శ్యాంప్రసాద్, స్వాతి, అర్చన, శ్రీనివాస్, అధికారులు, డ్రిప్ కంపెనీల సిబ్బంది పాల్గొన్నారు.
జగిత్యాల ఏఎస్పీగా చేతన్ నితిన్
జగిత్యాలక్రైం: జగిత్యాల అడిషనల్ ఎస్పీగా పాండేరి చేతన్ నితిన్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. చేతన్ ప్రస్తుతం జనగామ ఏఎస్పీగా పనిచేస్తున్నారు. ఇక్కడకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి.
పౌష్టికాహారంతోనే తల్లీబిడ్డల ఆరోగ్యం
జగిత్యాలరూరల్: పౌష్టికాహారం తీసుకుంటేనే తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉంటారని ఐసీడీఎస్ సూపర్‌వైజర్ లత అన్నారు. మహిళాశిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సారంగాపూర్ మండలం రేచపల్లిలో పోషణపక్వాడా నిర్వహించారు. ఆహారం తినిపించే సమయంలో పిల్లలతో మాట్లాడటం ద్వారా.. ఇంట్లో అందుబాటులో ఉన్న వస్తువులతో ఆడిపించడం ద్వారా పిల్లల ఎదుగుదలకు ఉపయోగపడుతుందన్నా రు. సర్పంచ్ బాస మహేశ్, పంచాయతీ కార్యదర్శి సంతోష్, ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బోడ రెడ్డి, ఏఎన్‌ఎం శారద, ఆశా కార్యకర్తలు, అంగన్‌వాడీ టీచర్లు పాల్గొన్నారు.
ప్రజాచైతన్యంతోనే అగ్నిప్రమాదాల నివారణ
జగిత్యాలక్రైం: అగ్ని ప్రమాదాల నివారణపై ప్రజల్లో చైతన్యం రావాలని అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి సైదులు అన్నారు. జిల్లా కేంద్రంలోని పెట్రోల్ బంకుల్లో అగ్నిప్రమాదాలపై అవగాహన కల్పించారు. ప్రమాదాలు సంభవించినప్పుడు నివారణ చర్యలపై దృష్టి సారించాలన్నారు. వెంటనే ఫైర్ సిబ్బందికి సమాచారం అందించాలన్నారు. అగ్నిమాపక శాఖ అధికారి కృష్ణకాంత్, సిబ్బంది పాల్గొన్నారు.


