‘ఉపాధి’ లక్ష్యాలు చేరుకోవాలి | - | Sakshi
Sakshi News home page

‘ఉపాధి’ లక్ష్యాలు చేరుకోవాలి

Apr 19 2026 7:47 AM | Updated on Apr 19 2026 7:47 AM

● పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలి ● కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌

● పని ప్రదేశాల్లో సౌకర్యాలు కల్పించాలి ● కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌

మల్లాపూర్‌: ఉపాధి హామీ పథకంలో నిర్ధేశించిన లక్ష్యాలు చేరుకోవాలని కలెక్టర్‌ బి.సత్యప్రసాద్‌ అన్నారు. స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో ఉపాధి పనుల పురోగతిపై అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో సమీక్షించారు. కూలీల సంఖ్య పెంపుపై చర్చించారు. పనుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, అర్హులైన ప్రతి కుటుంబానికీ పని కల్పించాలని పేర్కొన్నారు. సమయానికి వేతనాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పనిని ఫొటో క్యాప్చరింగ్‌ ద్వారా ఎన్‌ఎంఎంఎస్‌ యాప్‌లో నమోదు చేయాలన్నారు. పని ప్రదేశంలో సౌకర్యాలు కల్పించాలని సూచించారు. నీడ, తాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. మెట్‌పల్లి ఆర్డీవో నరసింహరావు, డీఆర్డీవో రఘువరణ్‌, తహసీల్దార్‌ శ్రీనివాస్‌, ఎంపీడీవో జగదీష్‌, ఏపీవో సతీష్‌, సీనియర్‌ అసిస్టెంట్‌ మహేశ్‌ పాల్గొన్నారు.

జనగణన చేపట్టాలి

జగిత్యాల: జనగణన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కలెక్టర్‌ అన్నారు. ఎన్యుమరేట్లు, సూపర్‌వైజర్లకు శిక్షణ ఇచ్చారు. ఇంటి వివరాల సేకరణ, డిజిటల్‌ పద్ధతిలో డేటా నమోదు, ప్రజలతో వ్యవహరించే తీరు, గోప్యత, పరిరక్షణ వంటి అంశాలపై వివరించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ స్పందన, రూరల్‌ తహసీల్దార్‌ హకీం, ఎన్యుమరేటర్లు పాల్గొన్నారు.

రాయికల్‌ ఠాణా పరిశీలించిన ఎస్పీ

రాయికల్‌: పట్టణంలోని పోలీస్‌స్టేషన్‌ను ఎస్పీ అశోక్‌కుమార్‌ శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. రికార్డులు, రిజిష్టర్లు పరిశీలించారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయన వెంట రూరల్‌ సీఐ సుధాకర్‌, ఎస్సై సుధీర్‌రావు ఉన్నారు.

నేడు ‘మోడల్‌’ ప్రవేశ పరీక్ష

జగిత్యాల: జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2026–27 సంవత్సరం ఆరో తరగతిలో ప్రవేశాలకు.. 7, 8, 9, 10 తరగతుల్లో ఖాళీ సీట్లకు ఆదివారం పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈవో రాము తెలిపారు. 14 కేంద్రాల్లో 2,972 మంది విద్యార్థులు పరీక్ష రాయనున్నారని, అరగంట ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించారు.

Advertisement
 
Advertisement
Advertisement