జగిత్యాలరూరల్: రాష్ట్రంలో కార్పొరేట్‌కు దీటుగా ప్రభుత్వ విద్య అందించడం జరుగుతుందని సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. జగిత్యాల రూరల్‌మండలం లక్ష్మీపూర్‌లో రాంకీ గ్రూప్ ఫౌండేషన్ ఏర్పాటు చేసిన సరస్వతీ మాత విగ్రహం, బాస్కెట్‌బాల్ కోర్టును శుక్రవారం ఎమ్మెల్యే సంజయ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి ప్రత్యేక నిధులు వెచ్చించడం జరిగిందన్నారు. జగిత్యాల నియోజకవర్గంలో చల్‌గల్ వద్ద 25 ఎకరాల్లో రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మించనున్నట్లు పేర్కొన్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం మక్కల కొనుగోలుకు మద్దతు ధర ప్రకటించినా రాష్ట్ర ప్రభుత్వం క్వింటాల్‌కు రూ.700–800 నష్టాన్ని భరిస్తుందన్నారు. కేంద్రం మద్దతు ధర ప్రకటనకే పరిమితమైందన్నారు. అనంతరం గ్రామంలో మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటికే మొక్కజొన్న కేంద్రాన్ని ప్రారంభించి కొనుగోళ్లు వేగవంతం చేశామని, రైతులు మార్క్‌ఫెడ్ కేంద్రాల్లో పంట విక్రయించి మద్దతు ధర పొందాలన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గాజంగి నందయ్య, గ్రంథాలయ చైర్మన్ దినేశ్, డీఈవో రాములు, ఎంపీడీవో రమాదేవి, తహసీల్దార్ హకీం, సర్పంచ్ నల్ల కవిత, ఎంఈవో గంగాధర్, జిల్లా ఎస్సీ వెల్ఫేర్ అధికారి రాజ్‌కుమార్, ఏఎంసీ చైర్మన్ గడ్డం నారాయణరెడ్డి, ఉపసర్పంచ్ సత్తిరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు పన్నాల తిరుపతిరెడ్డి, డైరెక్టర్లు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి పెట్టాలి
జగిత్యాల: ప్రభుత్వ పాఠశాలలపై ప్రత్యేక దృష్టి సా రించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. ఆయా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, మౌలిక వసతులపై సంబంధిత ఎంఈవోలు నివేదిక ఇవ్వాలన్నారు. ఎమ్మెల్యే సంజయ్‌కుమార్ మాట్లాడుతూ, బీర్‌పూర్‌లో కేజీబీవీకి శాశ్వత భవనం ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. కలెక్టర్ సత్యప్రసాద్ మాట్లాడుతూ, ఎంఈవోలు పిల్లల సంఖ్యకు అనుగుణంగా అత్యవసరమైన వాటిని ఏర్పాటు చేసేలా చూడాలన్నారు. అడిషనల్ కలెక్టర్ రాజాగౌడ్, డీఈవో రాము, డీఈ ఇంజనీర్ సత్యనారాయణరావు, రాజ్‌కుమార్ పాల్గొన్నారు.


