పనుల నాణ్యతలో రాజీ పడొద్దు | - | Sakshi
Sakshi News home page

పనుల నాణ్యతలో రాజీ పడొద్దు

Apr 18 2026 7:59 AM | Updated on Apr 18 2026 7:59 AM

● కలెక్టర్‌ సత్యప్రసాద్‌

బుగ్గారం(ధర్మపురి): ఇందిరమ్మ ఇళ్ల పనుల నా ణ్యతలో రాజీపడొద్దని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ అ న్నారు.మండల కేంద్రంలో నిర్మిస్తున్న భవనాలను త్వరగా పూర్తి చేయించాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆకస్మిక పర్యటనలో భాగంగా మండలంలోని యశ్వంతరావుపేటలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. అనంతరం మండలకేంద్రంలో పలు ప్రభుత్వ భవనాల నిర్మాణాలు, గ్రామశివారులోని పీహెచ్‌సీ, ఎంపీడీవో, త హసీల్దార్‌, గ్రామైక్య సంఘాల భవనాల నిర్మాణ తీ రుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా వాటి ప్రగతి గురించి స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. బిల్లుల చెల్లింపులో ఎలాంటి ఇబ్బందులు లేవని, నిర్మాణాలను పూర్తి నాణ్యతతో త్వరగా పూ ర్తి చేయాలని సూచించారు. కలెక్టర్‌ వెంట బుగ్గారం సర్పంచ్‌ నక్క రాజవ్వ, డీఆర్‌డీఏ పీడీ రఘువరన్‌, ఆర్డీవో మధుసూదన్‌, తహసీల్దార్‌ భూమేశ్వర్‌, ఇన్‌చార్జి ఎంపీడీవో వాసవి, కార్యదర్శి అక్బర్‌, వీడీసీ నాయకులు గంగారెడ్డి తదితరులున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement