జగిత్యాలరూరల్: భూ సంబంధిత అంశాలపై క్షేత్రస్థాయి విచారణ చేపట్టడం జరుగుతుందని అదనపు కలెక్టర్ లత అన్నారు. శుక్రవారం పొరండ్ల గ్రామంలో నేషనల్ హైవే 63 వద్ద భూ సంబంధిత అంశాలపై విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ప్రత్యక్షంగా స్థలాన్ని సందర్శించడం ద్వారా భూ సమస్యలు, సరిహద్దులు రికార్డులను సమగ్రంగా పరిశీలించవచ్చన్నారు. స్థానిక రైతులు, భూ యజమానుల నుంచి అభిప్రాయాలు, ఫిర్యాదులు స్వీకరించడం ద్వారా సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భూ రికార్డులను సరిదిద్దడం, అవసరమైన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయడం, చట్టబద్ధమైన ప్రక్రియ వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. తహసీల్దార్ హకీం, ఆర్‌ఐ భూమయ్య, శంషోద్దీన్ పాల్గొన్నారు.


