మల్లాపూర్: టీబీ ముక్త్ అభియాన్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ప్రోగ్రాం అధికారి శ్రీనివాస్ అన్నారు. వందరోజుల ప్రణాళికలో భాగంగా గురువారం మండలకేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో టీబీ వైద్యశిబిరం నిర్వహించారు. ఆకలి మందగించడం, బరువు తగ్గడం, చెమటలు పట్టడం, గొంతుభాగంలో గడ్డలు టీబీ లక్షణాలని పేర్కొన్నారు. పరీక్షలు చేయించుకుని చికిత్స పొందాలన్నారు. వ్యాధి నిర్ధారణ అయితే ఉచితంగా మందులు అందిస్తారని తెలిపారు. 92మందికి ఎక్స్‌రే తీసి సూచనలు అందించారు. మండల వైద్యాధికారి, మెడికల్ ఆఫీసర్ వాహిని, జిల్లా కో–ఆర్డినేటర్ కట్ట హరీశ్, సీహెచ్‌వో లింగ రామ్మోహన్, సూపర్‌వైజర్ ఆంజనేయులు, ల్యాబ్‌టెక్నిషన్ ఉమాదేవి, స్టాఫ్‌నర్స్ సుమలత, ఫార్మసిస్టు మహేశ్వరి పాల్గొన్నారు.


