ఎండవేడిమికి ఉపశమనం కోసం కొబ్బరినీరు తాగడమే మేలు. ఐస్ ఉన్న పళ్ల రసాలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒకవేళ తీసుకుంటే ఐస్ వాడొద్దు. వీటివల్ల అతిసారం, పేగు సంబంధిత వ్యాధులు, గొంతునొప్పి వంటివ్యాధులు వస్తాయి. జాగ్రత్తగా ఉండాలి.
– ఒడ్నాల రజిత, గైనకాలజిస్ట్
ఎండకాలంలో దాహం వేస్తే జ్యూస్ తాగాలని అనిపించినా.. ఐస్ మాత్రం వేసుకోవద్దు. ఏ వాటర్‌తో చేస్తున్నారో తెలియదు. ఊక పెట్టడంతో అవి శుభ్రత ఉండదు. ప్రజలు గ్రహించాలి. దీంతో వివిధ రకాల వ్యాధులు సైతం వస్తుంటాయి. జాగ్రత్తగా ఉండాలి.
– వాసాల శ్రీధర్, ఫిజిషియన్


