మల్యాల: కొండగట్టు శ్రీఆంజనేయ స్వామివారి సన్నిధిలో గురువారం జిల్లా మొదటి అదనపు సెషన్స్ జడ్జి సి.సునీతరవీందర్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఆలయ సంప్రదాయం ప్రకారం అర్చకులు వేదమంత్రాలతో జడ్జి దంపతులకు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ స్థానాచార్యులు కపిందర్ జడ్జి దంపతులకు శేషవస్త్రాలతో సన్మానించి తీర్థ ప్రసాదాలు అందించారు. కార్యక్రమంలో కోర్టు అధికారులు, ఎస్సై నరేశ్‌కుమార్, ఏఎస్సై రమణారెడ్డి, ఆలయ సూపరింటెండెంట్ ఉపాద్యాయుల చంద్రశేఖర్ పాల్గొన్నారు.
బురుజుల స్థలాన్ని రక్షించండి
కోరుట్ల: కోరుట్ల పట్టణంలోని పురాతన చిహ్నాలైన గడి బురుజులు, వాటిని ఆనుకుని ఉన్న స్థలాన్ని రక్షించాలని బీఆర్‌ఎస్ కౌన్సిలర్లు కొక్కెర వెంకటేశ్, పొట్ట సురేందర్, మోసిన్ అదనపు కలెక్టర్ రాజాగౌడ్‌కు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. గడి బురుజుల స్థలానికి కొత్త వీఎల్‌టీ నంబర్లు సృష్టించి స్థలం అమ్మకానికి యత్నిస్తున్నారని ఆరోపించారు. కోరుట్లలో అనధికారిక రియల్ వెంచర్లు ఏర్పాటు చేసి ప్లాట్ల అమ్మకాలు, కొనుగోలు సాగుతున్నా మున్సిపల్ అఽధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. కోరుట్లలో ఎక్కడ చూసినా అవినీతిమయంగా మారిపోయిందని, ఈ పరిస్థితిని తొలగించి అవసరమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు.
ప్రభుత్వ పథకాలు వినియోగించుకోవాలి
రాయికల్: ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని మున్సిపల్ చైర్మన్ కట్కం రవి అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా 99 రోజుల ప్రణాళికపై గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ తురగ సౌజన్య, కమిషనర్ కీర్తి నాగరాజు, కౌన్సిలర్లు పుర్రె శ్రీధర్, తహసీల్దార్ నాగార్జున, ట్రాన్స్‌కో ఏఈ నవీన్, మెడికల్ ఆఫీసర్ సతీశ్ పాల్గొన్నారు.
అర్హులందరికీ పథకాలు అందిస్తాం
మెట్‌పల్లి: అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి అన్నారు. ప్రజాపాలన, ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా గురువారం పట్టణంలో మున్సిపల్ స్థాయి సమావేశం నిర్వహించారు. దీనికి పలు శాఖల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం పేదలను ఆదుకోవడం కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందన్నారు. వాటిని అర్హులందరికి అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలన్నారు. కౌన్సిలర్లు నరేష్, పురుషోత్తం, ఎంఈవో కనకతార, మేనేజర్ వెంకటలక్ష్మీ, డీఈఈ నాగేశ్వర్‌రావు, టీపీవో రాజేంద్రప్రసాద్ తదితరులున్నారు.


