బాహుబలులు | - | Sakshi
Sakshi News home page

బాహుబలులు

Apr 17 2026 11:08 AM | Updated on Apr 17 2026 11:08 AM

● జనాభాలో అత్యధికం వారే.. ● ఎస్సీ, ఓసీ జనాభాలో కరీంనగర్‌ టాప్‌ ● ఎస్టీ, బీసీ పాపులేషన్‌లో అగ్రభాగాన జగిత్యాల ● ఎస్‌ఈఈఈపీసీ సర్వేలో ఉమ్మడి జిల్లా గణాంకాలు

బహుజనులే...

సాక్షి ప్రతినిధి, కరీంనగర్‌:

మ్మడి కరీంనగర్‌ జిల్లాలో జనాభాపరంగా బీసీలు, ఎస్సీలే అధికంగా ఉన్నారు. ఈ విషయం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా వెల్లడించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులగణన (ఎస్‌ఈఈఈ పీసీ–2024) సర్వేలో వెల్లడించింది. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ కులాల గణన వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను తెలుసుకునేందుకు ప్రభుత్వం గతేడాది కరీంనగర్‌, పెద్దపల్లి, జగిత్యాల, రాజన్న సిరిసిల్లలో చేసిన ఎస్‌ఈఈఈపీసీ సర్వే ఉమ్మడి జిల్లా గణాంకాలు పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నాయి. జనాభాపరంగా బీసీలు, ఎస్సీలు అగ్రభాగాన నిలిచారు. ఎస్టీ, బీసీ జనాభాలో అగ్రభాగంలో జగిత్యాల ఉంది. ఎస్సీ, ఓసీ పాపులేషన్‌లో అగ్రభాగాన కరీంనగర్‌ నిలిచింది.

Advertisement
 
Advertisement
Advertisement