ధర్మ పరిరక్షణకు పాటుపడాలి | - | Sakshi
Sakshi News home page

ధర్మ పరిరక్షణకు పాటుపడాలి

Apr 17 2026 11:08 AM | Updated on Apr 17 2026 11:08 AM

● హిందూ సమ్మేళనంలో వక్తలు

● హిందూ సమ్మేళనంలో వక్తలు

జగిత్యాలటౌన్‌: హిందువులందరూ ఏకమై ధర్మపరిరక్షణ, దేశాభివృద్ధికి కృషి చేయాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా గురువారం పట్టణంలోని ధరూర్‌ క్యాంపు వాకర్స్‌ మైదానంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ముందుగా సా మూహిక హనుమాన్‌ చాలీసా పారాయణం చేపట్టా రు. చిన్నారులు సాంస్కృతిక ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. ప్రపంచమంతా హిందూ మతం వైపు చూస్తోందని, హైందవ మతం పూర్వవైభవం సంతరించుకుంటోందన్నారు. కుల వివక్ష తొలగిస్తూ.. స్వదేశీ భాష, స్వదేశీ సంస్కృతిని కాపాడుకోవడమే హిందూ సమ్మేళనం ముఖ్య ఉద్దేశమని అన్నారు. హిందూ సమ్మేళనం గౌరవ అధ్యక్షుడు తిగుళ్ల విశ్వనాథశర్మ, విశోకతీర్థ స్వామీజీ, సామాజిక సమరస రాష్ట్ర కన్వీనర్‌ అప్పా ల ప్రసాద్‌, కౌన్సిలర్‌ బోయినిపల్లి ప్రశాంత్‌రావు, హిందూ సమ్మేళన్‌ నిర్వహణ కమిటీ ప్రతినిధులు రాజమనో హర్‌రెడ్డి, శీలం ప్రవీణ్‌, బండ స్వామి, గడ్డల లక్ష్మీహరికృష్ణ, నరేష్‌, తేటకాల్‌ భారతి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement