జగిత్యాల: ఈనెల 20న జగిత్యాలలో నిర్వహించే కేసీఆర్ బహిరంగ సభపై బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్‌రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ధర్మపురి నియోజకవర్గ ఇన్‌చార్జి రవీందర్‌రావు జగిత్యాలకు రాగా వారిని ఆహ్వానించారు. జన సమీకరణే లక్ష్యమని, ప్రతి కార్యకర్త ప్రజలను తరలించేలా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీమంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీరమణ, జెడ్పీచైర్‌పర్సన్ దావ వసంత పాల్గొన్నారు.
రాజమ్మ నేత్రాలు సజీవం
బోయినపల్లి(చొప్పదండి): రాజన్నసిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం తడగొండకు చెందిన చేపూరి రాజమ్మ అనారోగ్యంతో ఈనెల 15న మృతిచెందగా ఆమె కుటుంబసభ్యులు లయన్స్‌క్లబ్ ఆఫ్ కమాన్‌పూర్ ఆధ్వర్యంలోని సదాశయ ఫౌండేషన్‌కు ఆమె నేత్రాలు దానం చేశారు. కమాన్‌పూర్ లయన్స్ క్లబ్ సదాశయ ఫౌండేషన్ సభ్యుడైన రాజమ్మ పెద్ద కుమారుడు చేపూరి దేవేందర్ నేత్రదానంపై తన సోదరుడు చేపూరి రవీందర్‌తోపాటు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించారు. దీంతో వారు నేత్రదానానికి ఒప్పుకోవడంతో టెక్నీషియన్ గాజుల సతీశ్ సహకారంతో కార్నియాలు సేకరించి హైదరాబాద్‌లోని ఐ బ్యాంక్ పంపించారు. కుటుంబ సభ్యులను సదాశయ ఫౌండేషన్ జాతీయ అధ్యక్షుడు శ్రవణ్‌కుమార్, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి అభినందించారు. మాజీ సర్పంచ్ చిందం రమేశ్, మున్నూరుకాపు సంఘం నాయకులు సింగరి రమేశ్, బుర్ర రాజు, రేండ్ల కనకయ్య, ముదాం శ్రీనివాస్, చిందం శ్రీనివాస్ ఉన్నారు.


