సూర్యోదయం వేళ ఆకాశంలో అప్పుడే ఉదయిస్తున్న భానుడు.. సూర్యుని లేలేత కిరణాలతో ఆకాశం నారింజ, ఎరుపు రంగులో మెరిసిపోతోంది. మత్స్యకారులు విసిరిన వలను చూసి మురిసిపోయింది. ఆకాశం ప్రతిబింబంతో నీళ్లు ఎర్రగా మెరుస్తుంటే.. మత్స్యకారులు గంటల తరబడి వేచిచూస్తూ చల్లని గాలి, నిశ్శబ్ద వాతావరణంలో చేపలవేట కొనసాగించారు. ఇది చూపరులకు ఒకగొప్ప అనుభూతి ఇచ్చింది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నీరుకుళ్ల మానేరులో మత్య్సకారుల చేపలవేట దృశ్యాలు ‘సాక్షి’ కెమెరాకు ఇలా అందంగా కనిపించాయి.
– సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి


