కేసుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యం | - | Sakshi
Sakshi News home page

కేసుల సత్వర పరిష్కారానికి ప్రాధాన్యం

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

● జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి

జగిత్యాలజోన్‌: కోర్టుల్లో పేరుకుపోతున్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.రత్న పద్మావతి తెలిపారు. మొదటి అదనపు జిల్లా జడ్జి సుగళి నారాయణ నిజామాబాద్‌కు బదిలీకాగా.. బుధవారం బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వీడ్కోలు పలికారు. కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ.. జిల్లా జడ్జి నారాయణ మూడేళ్లలో 770 కేసులు పరిష్కరించారని, జిల్లా కోర్టుకు మంచి పేరు తెచ్చారని పేర్కొన్నారు. జడ్జిలు వెంకటమల్లిక్‌ సుబ్రహ్మణ్య శర్మ, లావణ్య, శ్రీనిజ, నిఖిషా, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు ఎర్ర నర్సయ్య, ఉపాధ్యక్షుడు సత్యం, ప్రధాన కార్యదర్శి అందె మారుతి, న్యాయవాదులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement