మక్కల కొనుగోళ్లలో జాప్యమెందుకు..? | - | Sakshi
Sakshi News home page

మక్కల కొనుగోళ్లలో జాప్యమెందుకు..?

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

● బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు గోపాల్‌రెడ్డి

కథలాపూర్‌: మక్కల కొనుగోళ్లలో అధికారులు జాప్యం చేయడం సరికాదని బీజేపీ కిసాన్‌మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపెల్లి గోపాల్‌రెడ్డి అన్నారు. కథలాపూర్‌లో మార్క్‌ఫెడ్‌ ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని బుధవారం సందర్శించారు. రైతులతో మాట్లాడి సమస్య అడిగి తెలుసుకున్నారు. మక్కలు కుప్పలుగా పేరుకుపోతుంటే ఇప్పటివరకు కేవలం రెండు లారీల ధాన్యాన్ని మాత్రమే కొనడం సరికాదన్నారు. కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్‌ చేశారు. వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరగా ప్రారంభించాలన్నారు. తూకంలో కోతలు విధించొద్దన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు వెంకటేశ్వర్‌రావు, మండల అధ్యక్షుడు మల్యాల మారుతి, నాయకులు గాంధారి శ్రీనివాస్‌, ప్రసాద్‌, ప్రతాప్‌, మహేశ్‌, జీవన్‌రెడ్డి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement