భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలి

Apr 16 2026 11:59 AM | Updated on Apr 16 2026 11:59 AM

● అడిషనల్‌ కలెక్టర్‌ లత

రాయికల్‌: భూభారతి దరఖాస్తులు పరిష్కరించాలని అడిషనల్‌ కలెక్టర్‌ లత అన్నారు. పట్టణంలోని తహసీల్దార్‌ కార్యాలయాన్ని బుధవారం తనిఖీ చేశారు. భూభారతి పెండింగ్‌ అంశాలు, ఓటరు జాబితా సవరణ, సాదాబైనామా అంశాలపై చర్చించారు. మీసేవ సర్టిఫికెట్లు పెండింగ్‌ లేకుండా పూర్తి చేయాలన్నారు. జనగణన విధులు అప్పగించిన అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు. జనగణనకు ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లను నియమిస్తామని తెలిపారు. ఆమె వెంట తహసీల్దార్‌ నాగార్జున ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement