డర్టీ కపుల్స్..
కరీంనగర్‌రూరల్: ఈజీ మనీకోసం అలవాటు పడిన ఆ దంపతులు అడ్డదార్లు తొక్కారు. ఇందుకు సోషల్ మీడియాను వేదికగా మార్చుకున్నారు. ఇన్‌స్టాగ్రాంలో తన భార్య ఫొటోలు షేర్ చేస్తూ యువకులకు వలపు గాలం వేశాడో భర్త. ఆపై ఇంటికి పిలిచించి.. తన భార్యతో వారు ఏకాంతంగా ఉన్నప్పుడు వీడియోలు చిత్రీకరించాడు. కొన్నాళ్లకు బ్లాక్‌మెయిల్ చేస్తూ.. అందినకాడికి దండుకున్నారు. ఇలా రూ.లక్షల్లో మోసపోయిన ఓ వ్యక్తి ఇచ్చిన ఫిర్యాదుతో కరీంనగర్ రూరల్ పోలీసులు విచారణ చేసి ఆ డర్టీ కపుల్స్‌ను బుధవారం అరెస్టు చేశారు. సీఐ నిరంజన్‌రెడ్డి కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లాకు చెందిన దంపతులు రెండేళ్లనుంచి ఆరెపల్లిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో అద్దెకుంటున్నారు. ఇన్‌స్టాగ్రాంలో భార్య ఫొటో, సెల్‌నంబరు పెట్టి వలపువల వేశారు. దీంతో కరీంనగర్‌తోపాటు సమీప ప్రాంతాలకు చెందిన దాదాపు 100మంది యువకులు పలుమార్లు ఫ్లాట్‌కు వచ్చివెళ్లేవారు. అలా వచ్చినవారు తన భార్యతో ఏకాంతంగా ఉన్న సమయంలో రహస్యంగా ఫొటోలు, వీడియోలు తీసేవాడు. తరువాత బెదిరింపులకు పాల్పడి డబ్బులు వసూలు చేసేవారు. ఏడాదిక్రితం కరీంనగర్‌కు చెందిన ఓ వ్యాపారిని ఇలానే బెదిరించి ఫ్లాట్, కారు ఈఎంఐలు కట్టించారు. కొన్ని రోజుల నుంచి సదరు వ్యాపారి తన వద్దకు రాకపోవడంతో రూ.5 లక్షలు ఇవ్వకుంటే నగ్న ఫొటోలు, వీడియోలు మీ కుటుంబసభ్యులు పంపిస్తామని బెదిరించారు. భయపడి రూ.లక్ష ఇచ్చాడు. ఇలా రూ.14 లక్షలు ఇచ్చానని, వీడియోలు తొలగించాలని వ్యాపారి కోరగా ఒప్పుకోలేదు. దీంతో సదరు వ్యాపారి మంగళవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా దంపతులపై కేసు నమోదు చేశారు. ఏసీపీ విజయ్‌కుమార్ ఆదేశాల మేరకు సీఐ నిరంజన్‌రెడ్డి ఆద్వర్యంలో బుధవారం బైపాస్‌రోడ్డులో అదుపులోకి తీసుకున్నారు. నేరాన్ని అంగీకరించడంతో కోర్టులో హాజరుపరుచగా 14రోజులు రిమాండ్ విధించారు.


