మంచి అవకాశం
సీఎంకప్ క్రీడలు ఔత్సాహికులకు మంచి అవకాశం. గ్రామీణ క్రీడాకారుల్లో దాగిఉన్న క్రీడా నైపుణ్యం ఈ పోటీలతో వెలుగులోకి వస్తుంది. గ్రామస్థాయి నుంచి ప్రపంచస్థాయి వరకు క్రీడాకారులను తీర్చిదిద్దడమే సీఎం కప్ ప్రధాన ఉద్దేశం. ఆసక్తిగల క్రీడాకారులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
– వి శ్రీనివాస్‌గౌడ్, డీవైఎస్‌వో, కరీంనగర్
క్రీడలను ప్రోత్సహించడమే సీఎంకప్ లక్ష్యం. గ్రాస్ రూట్‌స్థాయి నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రతిభను గుర్తించి, గ్లోబల్‌స్థాయిలో చాంపియన్‌లను తయారు చేయొచ్చు. అధికారులు, క్రీడాసంఘాలు, పీడీ, పీఈటీలు, సీనియర్ల సహకారంతో సీఎం కప్ పోటీలను విజయవంతంగా నిర్వహిస్తాం.
– ఎ.సురేశ్ కుమార్, డీవైఎస్‌వో, పెద్దపల్లి
తెలంగాణలో నెల రోజుల పాటు జరిగే చీఫ్ మినిస్టర్స్ కప్ పోటీలను విజయవంతం చేయాలి. ప్రతీ ఒక్క క్రీడా సంఘం బాధ్యుడు పోటీల నిర్వహణకు ప్రత్యేక చొరవ తీసుకోవాలి. రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా జట్లు విజయం సాధించి జిల్లా పేరును నిలపాలి.
– గసిరెడ్డి జనార్ధన్‌రెడ్డి, తెలంగాణ ఒలింపిక్
సంఘం సంయుక్త కార్యదర్శి
మంచి అవకాశం
మంచి అవకాశం


