దూలూర్‌లో కోడిపందాలు
కథలాపూర్(వేములవాడ): మండలంలోని దూలూర్ శివారులో బుధవారం కోడిపందాల ఆట జోరుగా సాగింది. ఇందులో భాగంగా వేలాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. కోడిపందాలు నిర్వహిస్తున్నారని తెలిసి మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సుమారు 50 మంది వరకు అక్కడకు చేరుకున్నట్లు తెలిసింది. మొదటగా ఆటకు రూ.5వేల చొప్పున ప్రారంభమై.. ఉత్కంఠగా మారి రూ.50వేల వరకు డబ్బులు పెట్టినట్లు సమాచారం. ఆటలో డబ్బులు పోగొట్టుకున్నవారు నిరాశతో వెనుదిరగారు. డబ్బులు వచ్చిన వారు సంతోషంలో మునిగిపోయారు. కోడిపందాలు యథేచ్ఛగా జరిగినప్పటికీ అధికారులు అటువైపు కన్నెత్తి చూడకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.


