
నృసింహునికి దేవాదాయ అదనపు కమిషనర్ పూజలు
పూజలు చేస్తున్న అదనపు కమిషనర్ దంపతులు
ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామివారిని ఆదివారం దేవాదాయశాఖ అదనపు కమిషనర్ కూరాకుల జ్యోతి దంపతులు దర్శించుకున్నారు. స్వామివారి అభిషేకంలో పాల్గొన్నారు. ఆలయ చైర్మన్ జక్కు రవీందర్, ఈవో శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్రం, ప్రసాదాలు అందించారు. ఆలయ అర్చకులు, సిబ్బంది, ధర్మకర్తల మండలి సభ్యులు తదితరులున్నారు.
కథలాపూర్‌లో కేంద్ర బృందం
వివరాలు తెలుసుకుంటున్న కేంద్ర బృందం అధికారులు
కథలాపూర్: స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్–2025లో భాగంగా గ్రామాల్లో చేపట్టిన పారిశుధ్య పనులను పరిశీలించేందుకు కేంద్రబృందం అధికారులు ఆదివారం పర్యటించారు. పలు వాడల్లో పర్యటించి చెత్త సేకరణ, చెత్త తరలింపు, వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణంపై ఆరా తీశారు. కార్యక్రమంలో కేంద్ర బృందం అధికారులు రాజు, హరిణి, ఎంపీవో రాజశేఖర్, కార్యదర్శి సాయినాథ్, సత్తయ్య, ఇస్మాయిల్, అంగన్‌వాడీ టీచర్లు, మహిళ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
39.847 టీఎంసీలకు చేరిన ఎస్సారెస్పీ
ఎస్సారెస్పీ
జగిత్యాలఅగ్రికల్చర్: జిల్లాకు తాగు, సాగునీరు అందించే ఎస్సారెస్పీ నీటిమట్టం ఆదివారం నాటికి 39.747 టీఎంసీలకు చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 8175 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. ప్రాజెక్టు నుంచి 774 క్యూసెక్కుల అవుట్ ఫ్లోగా ఉంది. కాకతీయ మెయిన్ కెనాల్‌కు 100 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 231 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు.
రాయికల్‌లో వైద్య శిబిరం
రాయికల్: పద్మశాలీ యువజన సంఘం ఆధ్వర్యంలో ఆదివారం పట్టణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ సభ్యులకు బీపీ, షుగర్ పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యులు ప్రవీణ్, యువజన సంఘ పట్టణ అధ్యక్షుడు సామల్ల సతీశ్, ప్రధాన కార్యదర్శి ఆడెపు రాజీవ్, ఎలిగేటి సతీష్ సింగని సతీష్, కోశాధికారి బోమ్మకంటి నవీన్, సహాయ కార్యదర్శి చంద్ర తేజ,గంట్యాల ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు

నృసింహునికి దేవాదాయ అదనపు కమిషనర్ పూజలు

నృసింహునికి దేవాదాయ అదనపు కమిషనర్ పూజలు

నృసింహునికి దేవాదాయ అదనపు కమిషనర్ పూజలు