పైకిరాని గంగమ్మ.. | - | Sakshi
Sakshi News home page

పైకిరాని గంగమ్మ..

Aug 4 2025 3:39 AM | Updated on Aug 4 2025 3:39 AM

పైకిర

పైకిరాని గంగమ్మ..

● వర్షాలు లేక పెరగని భూగర్భజలం ● ఆందోళనలో అన్నదాతలు ● గతేడాది జూలైతో పోల్చితే 0.65 మీటర్ల లోతుకు ● పంటలు కాపాడుకునేందుకు రైతుల అగచాట్లు

జగిత్యాలఅగ్రికల్చర్‌:జిల్లాలో గంగమ్మ ఇంకా పైకి రాలేదు. ఎండాకాలంలో సాధారణంగా లోతుకు పడిపోయిన భూగర్భజలం.. నీటిమట్టం వానాకాలంలో కురిసే వర్షాలకు పెరుగుతుంది. కానీ.. ఈ ఏడాది వానాకాలం సీజన్‌ సమీపించి రెండు నెలలు గడిచినా.. భూగర్భజలాలు ఇంకా పెరగకపోగా.. ఇంకా పడిపోతున్నాయి. లోతుకు చేరిన భూగర్భజలంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. రానున్న రోజుల్లో పరిస్థితి ఇలాగే ఉంటే సాగు చేసిన పంటల పరిస్థితి ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు.

ఆయకట్టు మండలాల్లో కూడా..

జిల్లాలో ఆయకట్టు మండలాలు 14 ఉన్నాయి. వర్షాలు సకాలంలో కురవకపోవడంతో ఈ మండలాల్లోనూ భూగర్భ నీటిమట్టం పడిపోయింది. దీంతో ఆ యకట్టు రైతులకు ఆందోళన నెలకొంది. బీర్‌పూర్‌లో 1.34 మీటర్లు, బుగ్గారంలో 5.26, ధర్మపురిలో 3.30, ఎండపల్లిలో 9.44, గొల్లపల్లిలో 3.59, జగి త్యాల రూరల్‌లో 1.49, జగిత్యాల అర్భన్‌లో 7.45, పెగడపల్లిలో 2.75, రాయికల్‌లో 3.75, సారంగా పూర్‌లో 5.07, వెల్గటూర్‌లో 4.02, ఇబ్రహీంపట్నంలో 4.64, కోరుట్లలో 8.53, మల్లాపూర్‌లో 5.26 మీ టర్ల లోతుకు భూగర్భజలాలు పడిపోయాయి. ము న్సిపాలిటీలుగా ఉన్న జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, రాయికల్‌, మెట్‌పల్లి మండలాల్లో నీటి వినియోగం ఎక్కువ కావడంతో మరింత లోతుకు పడిపోతున్నాయి. మున్సిపాలిటీల దాహార్తిని తీర్చేందుకు ఎస్సారెస్పీ నుంచి మిషన్‌ భగీరథ ద్వారా ప్రతిరోజు 61 క్యూసెక్కుల నీటిని తరలిస్తున్నారు. ఆ నీటిని తరలించకుంటే మున్సిపాలిటీలో మరింత లోతుకు భూగర్భజలాలు పడిపోయేవని అధికారులు చెబుతున్నారు.

బోర్ల నుంచి నీరు రావడం లేదు

భూగర్భజలాలు లోతుకు పడిపోయాయి. బోర్ల నుంచి ఇప్పుడే నీరు సరిగా రావడం లేదు. రాబోయే రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కావడం లేదు. వర్షాలు పడి పుష్కలంగా భూగర్భజలాలు పెరిగితేనే రైతులు పంటలు పండించే పరిస్థితి ఉంది.

– కొమ్ముల రాజేందర్‌ రెడ్డి,

బొమ్మెన, కథలాపూర్‌

నీటిని పొదుపుగా వాడుకోవాలి

పట్టణాల్లోనే కాదు.. పల్లె ప్రజలూ నీటిని పొదుపుగా వాడుకోవాలి. ప్రస్తుత వానాకాలం సీజన్‌లో సరైన వర్షాలు లేక భూగర్భజలాలు పెరగడం లేదు. గతేడాది జూలైతో పోల్చితే ఈ జూలైలో భూగర్భజలాలు లోతుకు పడిపోయాయి.

– జి.నాగరాజు, భూగర్భజల అధికారి

గతేడాది జూలైతో పోల్చితే ఈ ఏడాది జూలై నెలలో భూగర్భజలం 0.69 మీటర్ల లోతుకు పడిపోయింది. గతేడాది సగటున 3.96 మీటర్ల లోతులో నీరు ఉండగా.. ఇప్పుడది 4.49 మీటర్లకు పడిపోయింది. అత్యధికంగా కొడిమ్యాల మండలంలో నీటిమట్టం 11.90 మీటర్లకు పడిపోయింది. అత్యల్పంగా బీర్‌పూర్‌ మండలంలో 1.34 మీటర్లకు తగ్గింది. నాన్‌ ఆయకట్టు మండలాలైన మల్యాలలో 5.83 మీటర్లు, భీమారంలో 2.05 మీటర్లు, మేడిపల్లిలో 3.74 మీటర్లు, కథలాపూర్‌లో 2.47 మీటర్లు, మెట్‌పల్లిలో 5.39 మీటర్లకు భూగర్భజలాలు పడిపోయాయి. ఈ ఏడాది జూలైలో వర్షాలు కొంత ఆశాజనంకంగా ఉన్నప్పటికీ.. భూగర్భజలాలు మాత్రం ఆశించిన స్థాయిలో పెరిగిన దాఖలాలు కనబడటం లేదు. నాన్‌ ఆయకట్టు మండలాల్లో ఎక్కువగా వరి సాగు చేస్తున్నారు. ఆ పంటకు నీటి అవసరం ఎక్కువ కావడంతో బోర్లు, వ్యవసాయ బావుల ద్వారా పగలు, రాత్రి తేడా లేకుండా నీటిని తోడుతూనే ఉన్నారు. ఫలితంగా ఆ మండలాల్లో భూగర్భజలాలు రోజురోజుకూ పడిపోతున్నాయి.

గతేడాదితో పోల్చితే

మరింత లోతుకు..

పైకిరాని గంగమ్మ..1
1/2

పైకిరాని గంగమ్మ..

పైకిరాని గంగమ్మ..2
2/2

పైకిరాని గంగమ్మ..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement