
కేంద్ర పథకాలు ఇంటింటికీ వివరించాలి
● బీజేపీ జిల్లా అధ్యక్షుడు యాదగిరిబాబు
మల్లాపూర్: కేంద్రప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ఇంటింటికీ వివరించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాచకొండ యాదగిరిబాబు, రాష్ట్ర నాయకులు రఘు అన్నారు. మండలకేంద్రంతోపాటు ముత్యంపేట, పాతదాంరాజుపల్లి, వాల్గొండలో కుల సంఘాలకు మంజూరైన ఎంపీ ల్యాడ్స్ నిధుల ప్రోసిడింగ్ పత్రాలు పంపిణీ చేశారు. ప్రధాని మోదీ సుపరిపాలనతో దేశం అన్నిరంగాల్లో పురోగతి సాధిస్తోందన్నారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు వడ్డెపల్లి శ్రీనివాస్, ఎర్ర లక్ష్మీ, పందిరి నాగరాజు, లవంగ శివకుమార్, ఇల్లెందుల కాంతయ్యచారి, గజ్జి శ్రీను, బూత్‌లెవల్ అధ్యక్షులు, శక్తి కేంద్రాల ఇన్‌చార్జిలు పాల్గొన్నారు.