
● సంఘం కల్యాణ మండపానికి రూ.20 లక్షలు ● ఆత్మీయ సమ్మేళనంల
ధర్మపురి: మున్నూరుకాపులతో తనకు విడదీయరాని బంధం ఉందని, వారి అభివృద్ధికి కృషి చేస్తానని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. పట్టణంలో ఆదివారం ఏర్పాటు చేసిన మున్నూరుకాపుల ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పట్టణ అధ్యక్షుడు చీపిరిశెట్టి రాజేశ్, ప్రధానకార్యదర్శి కాశెట్టి మహేశ్, ఉపాధ్యక్షులు చల్ల రవి, ముత్తినేని లక్ష్మణ్, కోశాధికారి బుక్క మహేశ్ తదితరులను మంత్రి సన్మానించారు. జిల్లాలో అధికంగా మున్నూరుకాపులే ఉన్నారని తెలిపారు. పట్టణంలో సంఘం కల్యాణ మండపానికి రూ.20లక్షలు కేటాయిస్తానని, దశలవారీగా మరిన్ని నిధులు అందిస్తానని తెలిపారు. సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బాదినేని రాజేందర్ కల్యాణమండపానికి రూ.లక్ష అందిస్తానని ప్రకటించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు రాజశేఖర్, సంగి నర్సయ్య, సంగి సత్తమ్మ, బండి మురళి, ఎస్.దినేష్, జక్కు రవీందర్, సంఘ సభ్యులున్నారు.