
సవాల్‌కు సై అంటే సై
కోరుట్ల/కోరుట్లరూరల్: యూరియా సరఫరాలో కాంగ్రెస్ విఫలమైందన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ చేసిన వ్యాఖ్యలు తప్పని.. కోరుట్ల మండలం అయిలాపూర్‌లో శనివారం బహిరంగ చర్చకు రావాలని కాంగ్రెస్ సవాల్ విసిరిన క్రమంలో ఉద్రిక్తత నెలకొంది. ఉదయం అయిలాపూర్ రైతు వేదిక సమీపంలో ఇరువర్గాలు తమ నాయకులు, కార్యకర్తలను మోహరించడంతో ఒక దశలో ఘర్షణ జరిగే పరిస్థితి కనిపించింది. పోలీసులు జోక్యం చేసుకుని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ నాయకులను అక్కడి నుంచి తిప్పి పంపడంతో వివాదం సద్దుమణిగింది.
బీఆర్‌ఎస్ నాయకుల ముందస్తు అరెస్టు
బహిరంగ చర్చ నేపథ్యంలో వేకువజామున కోరుట్ల మాజీ జెడ్పీటీసీ దారిశెట్టి రాజేశ్, రైతుబంధు జిల్లా అధ్యక్షుడు చీటి వెంకట్రావ్, మెట్‌పల్లి మాజీ జెడ్పీటీసీ మారు సాయిరెడ్డి, మాజీ సర్పంచులు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, సందయ్య, అంజయ్య, బండి భూమయ్య, పట్టణ నాయకులు ఫయీం, అన్వర్, సజ్జు, సత్యం, ఆనంద్, సురేందర్ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఠాణాకు తరలించారు. బహిరంగ చర్చకు రమ్మని పిలిచి తమ పార్టీ శ్రేణులకు ఎదుర్కొవడం చేతకాదని గుర్తించి పోలీసులను అడ్డుపెట్టుకుని ముందస్తు అరెస్టు చేయించారని బీఆర్‌ఎస్ నాయకులు విమర్శించారు.
కోరుట్లలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ముఖాముఖి
బహిరంగ చర్చ రచ్చరచ్చ
బీఆర్‌ఎస్ నేతలముందస్తు అరెస్టు

సవాల్‌కు సై అంటే సై