స్నేహితుడా.. | - | Sakshi
Sakshi News home page

స్నేహితుడా..

Aug 3 2025 3:26 AM | Updated on Aug 3 2025 3:38 AM

తోటి మిత్రులకు సాయంగా.. దూరమైనవారి జ్ఞాపకంగా.. సేవలు చేస్తూ.. అండగా నిలుస్తూ..

ఉమ్మడి జిల్లాలో ఆదర్శంగా పలువురు నేడు స్నేహితుల దినోత్సవం

‘బృందావనంలో గోపాలురతో కన్నయ్య చేసిన దోస్తీ.. కుచేలుడితో కృష్ణుడి స్నేహం.. రామాయణంలో శ్రీరాముడు.. సుగ్రీవుల మైత్రి. అశోకవనంలో కాపలాగా ఉన్న త్రిజట సీతమ్మతల్లికి ఎన్నోవిధాలుగా ఊరడించి స్నేహానికి ప్రతీకగా నిలువగా.. దశరథుడితో ఉన్న మైత్రితో జటాయువు సీతమ్మ

తల్లిని రక్షించేందుకు రావణుడితో ప్రాణాలొడ్డి పోరాడింది. కర్ణుడు, దుర్యోధనుడి స్నేహం మంచీ చెడు, విచక్షణ, కీర్తి, అపకీర్తికి తావులేదని మహాభారతం వివరించింది’.

స్నేహం.. అనిర్వచనీయం.. అద్వితీయం.. అమ్మ అనే పదం తరువాత ఆత్మీయతను పంచే ఏకై క బంధం స్నేహం. కంటికి దూరమైనా మనసుకు దగ్గరగా ఉండేది స్నేహం. ఆపదలో ఉన్నప్పుడు ధైర్యం.. ఓదార్పునిచ్చేది నేస్తం.. విజయం సాధించినప్పుడు చప్పట్లు కొట్టేవారు.. విషాదంలో ఉన్నప్పుడు వెన్నుతట్టి ఓదార్చే నలుగురు స్నేహితులు లేని జీవితాన్ని ఎవరూ ఊహించరు. అందుకే మనిషికి తలా ఓ పేరున్నప్పటికీ.. అందరినీ దగ్గరకు చేర్చేది స్నేహబంధం మాత్రమే. స్నేహంకోసం ఏదైనా చేయాలనిపిస్తుంది. కష్టమైనా.. నష్టమైనా.. మన ఫ్రెండ్‌ కోసమే కదా అనిపిస్తుంది. ఇలా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో అనేకమంది తమ స్నేహితుల కోసం ఎన్నోరకాల సేవలందిస్తున్నారు. జీవితాలను నిలబెడుతున్నారు. కష్టాల్లో తోడునీడగా నిలుస్తున్నారు. వారి నుంచి దూరమైన స్నేహితుల పేరిట సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. స్నేహితుల పేరిట మరికొందరికి సాయంగా నిలుస్తున్నారు. నేడు స్నేహితుల దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు..!!

– విద్యానగర్‌/సప్తగిరికాలనీ

స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 100మందిని పలుకరించగా.. అభిప్రాయాలు ఇలా..

12

స్నేహం అంటే..?

అవసరాలు తీర్చేది

కల్మషం లేనిది

88

ఫ్రెండ్‌షిప్‌

కలుషితమైందా?

అవును

కాలేదు

38

62

నీకు ఎంతమంది నిజమైన ఫ్రెండ్స్‌ ఉన్నారు?

ఒకరు

ఇద్దరికి మించి

72

నీ ఫ్రెండ్‌కు ఇచ్చేస్థానం?

అమ్మానాన్న తరువాత ఫ్రెండ్‌

ఫస్ట్‌ నాన్న తరువాత

ఫ్రెండ్‌, అమ్మ

ఫ్రెండ్‌ తరువాత అమ్మ,నాన్న

58

28

14

స్నేహితుడా..1
1/3

స్నేహితుడా..

స్నేహితుడా..2
2/3

స్నేహితుడా..

స్నేహితుడా..3
3/3

స్నేహితుడా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement