
ఆప్తమిత్రుడి స్ఫూర్తితో..
జగిత్యాల: స్నేహబంధం గొప్పది. ఆ బాండింగే వేరు. స్నేహితులు మంచి కోరుతుంటారు. సూచనలు ఇస్తుంటారు. నాకు కడలి జయకృష్ణ మంచి స్నేహితుడు. బీటెక్ పూర్తయ్యాక అమెరికా వెళ్లి స్థిరపడదామని అనుకున్న. జయకృష్ణ వాళ్ల అక్కయ్య ఢిల్లీలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్నారు. ఆ సమయంలో జయకృష్ణ ఐఏఎస్‌కు ప్రిపేర్ కావాలని సలహాలు, సూచనలు ఇచ్చాడు. అమెరికాకు వెళ్లకుండా ఢిల్లీ వెళ్లి జయకృష్ణ వాళ్ల అక్కయ్య ప్రోత్సాహంతో సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాను. ఐఏఎస్ రావడంలో ఒకింత జయకృష్ణ పాత్ర ఉంది. ఐఏఎస్ అయిన తర్వాత ఎంతో మంది స్నేహితుల్లాగా కొలీగ్స్‌గా ఉంటారు. కానీ చిన్నతనంలో ఉన్న స్నేహితులను ఎప్పటికీ మరిచిపోం. – సత్యప్రసాద్, కలెక్టర్, జగిత్యాల