నృసింహుని సన్నిధిలో అదనపు జిల్లా జడ్జి | - | Sakshi
Sakshi News home page

నృసింహుని సన్నిధిలో అదనపు జిల్లా జడ్జి

Aug 3 2025 3:26 AM | Updated on Aug 3 2025 3:26 AM

నృసిం

నృసింహుని సన్నిధిలో అదనపు జిల్లా జడ్జి

ధర్మపురి: శ్రీలక్ష్మీనృసింహస్వామిని అదనపు జిల్లా జడ్జి నారాయణ శనివారం దర్శించుకున్నారు. అర్చకులు స్వాగతం పలికి పూజలు చేయించారు. ఆలయ చైర్మన్‌ జక్కు రవీందర్‌, ఈవో శ్రీనివాస్‌ జడ్జిని సన్మానించారు.

ఆరవెల్లిలో కేంద్ర బృందం పర్యటన

పెగడపల్లి: స్వచ్ఛసర్వేక్షణ్‌ గ్రామీణ్‌–2025లో భాగంగా కేంద్రబృందం సభ్యులు శనివారం మండలంలోని ఆరవెల్లిలో పర్యటించారు. గ్రామంలో అమలవుతున్న కేంద్రపథకాలు, చేపట్టిన అభివృద్ది పనులు, ఉపాధిహామీ పనులపై ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అంగన్‌వాడీకేంద్రాలు, హెల్త్‌ సబ్‌ సెంటర్‌, ప్రాథమికోన్నత పాఠశాలను సందర్శించారు. మరుగుదొడ్ల సదుపాయాలు తెలుసుకున్నారు. పలు వీధుల్లో పర్యటించి పారిశుధ్యం, పరిశుభ్రత, ఇంకుడుగుంతలను పరిశీలించారు. స్థానిక అధికారులు వారిని సన్మానించారు. టీం సూపర్‌వైజర్‌ వి.మధూకర్‌, ఎస్‌బీఎం కో–ఆర్డినేటర్‌ చిరంజీవి, ఎంపీడీవో శ్రీనివాస్‌రెడ్డి, ఈజీఎస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

కొండగట్టు పాత కోనేరు పూడ్చివేతకు నిర్ణయం

మల్యాల: కొండగట్టు అంజన్న సన్నిధిలోని పాత కోనేరును పూడ్చివేయాలని ఆలయ అధికారులు నిర్ణయించినట్లు తెలిసింది. దశాబ్దాల తరబడిగా భక్తులు ఈ కోనేరులోనే స్నానాలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రస్తుతం కొత్త కోనేరు అందుబాటులోకి రావడంతో పాత కోనేరు నిరుపయోగంగా మారింది. దానిని పూడ్చి చదును చేయాలని నిర్ణయించగా.. ఆలయ అర్చకులు సమ్మతించినట్లు అఽధికారులు తెలిపారు.

ఇసుక స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేయండి

జగిత్యాలటౌన్‌: భవన నిర్మాణదారుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లాకేంద్రంలో ప్రభుత్వం తరపున ఇసుక స్టాక్‌ పాయింట్‌ ఏర్పాటు చేయాలని మాజీమంత్రి జీవన్‌రెడ్డి కలెక్టర్‌ సత్యప్రసాద్‌కు లేఖ రాశారు. జిల్లాకేంద్రానికి సమీపంలో వాగులు, నదులు లేక ఇసుక లభించడంలేదని, దీంతో భవన నిర్మాణదారులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. అధిక ధరలు చెల్లించి ఇసుక కొనాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.

రాష్ట్రస్థాయి క్రీడాపోటీలకు 20మంది ఎంపిక

మెట్‌పల్లి: పట్టణంలోని మినీస్టేడియంలో శనివారం జిల్లా అథ్లెటిక్స్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రీడాపోటీలు నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గంగుల శ్రీధర్‌ జెండా ఊపి ప్రారంభించారు. పలు పోటీల్లో 320 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రతిభ చూపిన 20మందిని ఈనెల 7న జనగామలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు ప్రధాన కార్యదర్శి ఏలేటి ముత్తయ్యరెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షులు గజెల్లి రాందాస్‌, రాజు, కార్తీక్‌, వేణు, సింధుజ, లత, భవాని తదితరులున్నారు.

ఏకాగ్రతతో బస్సు నడపాలి

జగిత్యాలటౌన్‌: డ్రైవర్లు ఏకాగ్రతతో బస్సులు నడపాలని, ప్రమాదాలు జరగకుండా చూడాల ని, ప్రయాణికుల నమ్మకాన్ని నిలబెట్టుకోవా లని జిల్లా రవాణా అధికారి భద్రు నాయక్‌ అ న్నారు. రోడ్డు భద్రతా వారోత్సవాల్లో భాగంగా శనివారం ఆర్టీసీ జగిత్యాల డిపోలో డ్రైవర్లకు శిక్షణ ఇచ్చారు. సెల్‌ఫోన్‌ డ్రైవింగ్‌కు దూ రంగా ఉండాలన్నారు. మద్యం సేవించి బస్సులు నడుపొద్దన్నారు. బస్‌ రివర్స్‌ తీసుకునే స మయంలో కండక్టర్‌ సూచనలు పాటించాలని పే ర్కొన్నారు. డీఎం కల్పన మాట్లాడుతూ ప్ర యాణికులతో మర్యాదగా ప్రవర్తించాలని సూ చించారు. ప్రమాదాలు జరగకుండా బస్సు నడిపిన డ్రైవర్లను డిపో మేనేజర్‌ కల్పన అభినందించారు. కార్యక్రమంలో ఎంవీఐ రామారావు, ప్రమీల, డిపో ఏఈఎం కవిత, సేఫ్టీ వార్డెన్‌ ఎస్‌జే.రెడ్డి, డ్రైవర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

నృసింహుని సన్నిధిలో   అదనపు జిల్లా జడ్జి
1
1/2

నృసింహుని సన్నిధిలో అదనపు జిల్లా జడ్జి

నృసింహుని సన్నిధిలో   అదనపు జిల్లా జడ్జి
2
2/2

నృసింహుని సన్నిధిలో అదనపు జిల్లా జడ్జి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement