
పదేళ్ల గోస తీర్చిన ప్రజాప్రభుత్వం
వెల్గటూర్: ప్రజాప్రభుత్వం అధికారంలోకొచ్చాక ప్రజల పదేళ్ల గోసలు తీరాయని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. మండలకేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 1,569 మందికి రేషన్ కార్డులు, 37 మందికి కల్యాణలక్ష్మి, 50 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. రేషన్‌కార్డులు పంపిణీ చేయడంతోపాటు సన్నబియ్యం పంపిణీ చేస్తున్నామని పేర్కొన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ బిల్లు కోసం కేంద్రంపై యుద్ధం చేస్తున్నామని తెలిపారు. స్తంభంపల్లికి చెందిన దివ్యాంగుడికి ఇచ్చిన మాట ప్రకారం స్కూటీ అందించి తన ఉదారత చాటుకున్నారు. కార్యక్రమంలో కలెక్టర్ సత్యప్రసాద్, ఆర్డీవో మధుసూదన్, ఏఎంసీ చైర్మన్ గోపిక, నాయకులు గోపాల్‌రెడ్డి, శైలేందర్‌రెడ్డి, రాంరెడ్డి, రత్నాకర్, రాంమోహన్‌రావు, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
తల్లిపాలే పిల్లలకు బలం
బిడ్డ ఆరోగ్యానికి తల్లిపాలే బలమని మంత్రి అన్నారు. మహిళా శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల్లో కలెక్టర్‌తోపాటు పాల్గొన్నారు.
న్యాయవాదుల సమస్యలు పరిష్కరిస్తాం
గొల్లపల్లి: న్యాయవాదుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి అడ్లూరి అన్నారు. మంత్రిని ఆయన క్యాంపు కార్యాలయంలో ధర్మపురి బార్ అసోసియేషన్ న్యాయవాదులు మర్యాదపూర్వకంగా కలిశారు. ధర్మపురిలో కోర్టు అభివృద్ధికి కృషి చేయాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లగా సహకరిస్తానని పేర్కొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు అలుక వినోద్ కుమార్, ప్రధాన కార్యదర్శి మామిడాల శ్రీకాంత్ కుమార్, ఏజీపీ ఇ మ్మడి శ్రీనివాస్, న్యాయవాదులు పాల్గొన్నారు.
పాలనలో సంక్షేమానికే ప్రాధాన్యం
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్